ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కూళ్ళు, అంగన్ వాడీలను ఆరు రకాలుగా వర్గీకరిస్తున్నాం
- ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కూళ్ళు, అంగన్ వాడీలను ఆరు రకాలుగా వర్గీకరిస్తున్నాం 


- విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం 

- అంగన్ వాడీల నిర్మాణం, మరమ్మతులకు రూ. 5.80 కోట్లు 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, ఆగస్టు 7 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళు, ప్రస్తుతం ఉన్న అంగన్ వాడీ కేంద్రాలను ఆరు రకాలుగా వర్గీకరిస్తున్నామని, దీనికి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతు పనులపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణం, మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం రూ. 5.80 కోట్ల నిధులను మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో గుడివాడ రూరల్ మండలం కాశిపూడి తదితర ప్రాంతాల్లో అంగన్ వాడీ కేంద్రాల మరమ్మతు పనులు చేపట్టామన్నారు. ఇదిలా ఉండగా మన బడి నాడు - నేడు ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల దశ, దిశ మారనుందని చెప్పారు . విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలను ప్రభుత్వం అమలు చేయనుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులో అభ్యసనా నైపుణ్యాలను మెరుగుపరుస్తామని తెలిపారు. రాష్ట్రంలోని స్కూళ్ళను శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్ళు, ఫౌండేషనల్ స్కూళ్ళు, ఫౌండేషనల్ ప్లస్ స్కూళ్ళు, ప్రీ హైస్కూల్స్, హైస్కూళ్ళు, హైస్కూల్ ప్లస్ స్కూళ్ళుగా ప్రభుత్వం వర్గీకరిస్తోందన్నారు. పీపీ -1 నుండి 12 వ తరగతి వరకు జరుగుతున్న వర్గీకరణ వల్ల ఇప్పుడున్న 44 వేల పాఠశాలలు 58 వేలకు పెరుగుతాయన్నారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా ఉపాధ్యాయుల నియామకం జరుగుతుందన్నారు. దీంతో పాటు విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందుతుందన్నారు. ప్రపంచస్థాయికి తగ్గట్టుగా విద్యార్థులు తయారవుతారని చెప్పారు. సింగిల్ టీచర్ తో నడుస్తున్న పాఠశాలల్లో కూడా వర్గీకరణ ద్వారా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా సబ్జెక్ట్ ను బోధించే వేర్వేరు టీచర్లు వస్తారన్నారు. దీనివల్ల ఉపాధ్యాయులపై పనిభారం కూడా తగ్గిపోతుందన్నారు. అర్హత ఉన్న అంగన్‌వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఏర్పడతాయన్నారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ గా బోధించాలని సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. నూతన విద్యా విధానం, నాడు - నేడు కార్యక్రమాల కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేయడం జరుగుతోందని చెప్పారు. నూతన విద్యా విధానంపై అవగాహన కల్పించేందుకు ఓరియెంటేషన్ కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నారు. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, నాడు - నేడు కార్యక్రమాల వల్ల క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా పిల్లలను బడికి పంపాలన్న కోరిక తల్లిదండ్రుల్లో బలపడిందని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image