ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి అభినందనలు.

 

ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి అభినందనలు.


జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరు ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. వచ్చే నెల 4, 5 తేదీల్లో ఈ అవార్డులు అందుకోనున్న ఈ ఇద్దరు ఉపాధ్యాయులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కేంద్రం ఎంపిక చేసిన వారిలో విశాఖ జిల్లా నుంచి ఫణిభూషణ్ శ్రీధర్, చిత్తూరు జిల్లా నుంచి మునిరెడ్డి ఉన్న విషయం తెలిసిందే. అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం ఉంటుందని ఈ సందర్బంగా మంత్రి సురేష్ తెలిపారు.
Comments