తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు_

 తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు__తిరుమల (ప్రజా అమరావతి): తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దామా శేషాద్రి నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే అధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గి పరిస్థితులు చక్కబడాలని ప్రార్థించానన్నారు._

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image