ఏపీలో నానో యూరియా ప్లాంటు ఏర్పాటుకు సిద్ధంగా వున్నాం -మంత్రి కన్నబాబు
ఏపీలో నానో యూరియా ప్లాంటు ఏర్పాటుకు సిద్ధంగా వున్నాం  -మంత్రి కన్నబాబు 
సచివాలయం (ప్రజా అమరావతి):


ఏపీలో నానో  యూరియా ప్లాంట్ ఏర్పాటుకు సంసిద్దముగా ఉన్నామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు . నెల్లూరు జిల్లాలో  నానో యూరియా కర్మాగారం ఏర్పాటుతో పాటూ , ప్రత్యేక ఆర్ధిక మండలి (కిసాన్ సెజ్ ) తదితర సమస్యలను వివరించేందుకు కేంద్రం (ఢిల్లీ )నుంచి ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్ , జనరల్ మేనేజర్ జగన్ మోహన్ శుక్రవారం మంత్రి కన్నబాబుని సచివాలయం లో కలిశారు. ఈ సందర్బముగా నానో యూరియా ఫ్యాక్టరీ ఏర్పాటు , న్యాయస్థానం ఎదుట వున్న సెజ్ ఏర్పాట్ల సమస్యలని మంత్రి కన్నబాబుకు వివరించారు.  

అనంతరం మంత్రి మాట్లాడుతూ 

సీఎం జగన్ పారిశ్రామాభివృద్దికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు . సంబంధిత మంత్రులు , అధికారులు , న్యాయకోవిదులతో కలిసి సమస్యల పరిష్కారానికి సీఎం ఆదేశాలతో ముందుకెళ్తామని చెప్పారు . సివి 200  నానో యూరియా ప్లాంటు ఆంధ్రప్రదేశ్లో స్థాపించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  త్వరలో ఇఫ్కో   నానో డీఏపీ ప్లాంట్  కూడా ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు .

ఇటీవల  నానో యూరియా మార్కెట్లోకి విడుదల చేయగా రైతుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు . ఏపీ మార్కెటింగ్  శాఖ స్పెషల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు ఇఫ్కో అధికారులతో పాటు హాజరయ్యారు .
Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image