పవిత్రోత్సవములు ప్రారంభం:

 - పవిత్రోత్సవములు ప్రారంభం:


శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):

   ది.21-08-2021 నుండి ది.23-08-2021 వరకు నిర్వహించు పవిత్రోత్సవములు పురస్కరించుకుని ఈరోజు అనగా శ్రీ ప్లవ నామ సంవత్సర శ్రావణ శుద్ధ చతుర్దశి, ది.21-08-2021 న దేవస్థానం నందు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఉ.3.గం.లకు శ్రీ అమ్మవారికి స్నపనాభిషేకం, పవిత్ర మాలధారణ నిర్వహించిన అనంతరం ఉదయం గం.09.00 ల నుండి భక్తులకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించటం జరిగినది. శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు పూజా కార్యక్రమము యందు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమములు నిర్వహించుట జరిగినది.


రేపటి కార్యక్రమ వివరములు: 

-> ది.22-08-2021 నుండి ది.23-08-2021 వరకు 

- ఉ.09 గం.ల నుండి ఉ.11 గం.ల వరకు మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన సర్వప్రాయశ్చిత విధి తత్తత్ దేవతారాధన.

- సా.4 గం.ల నుండి సా.06 గం.ల వరకు మూల మంత్రం హవనములు, వేదపారాయణలు, హారతి మంత్రం పుష్పము.


-> ది. 23-08-2021, శ్రావణ బహుళ పాడ్యమి ఉ.08 గం.ల నుండి ఉ.10 గం.ల వరకు మూలమంత్రం హవణములు, శాంతిక పౌష్టిక హోమములు, కూష్మాండబలి.

-> ఉ.10 గం.లకు మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, మార్జన, మహదాశీర్వచనము   తో కార్యక్రమము సమాప్తి.

Comments