రాష్ట్రంలోనే ఎపిఎండిసిని ప్రగతి పథంలో నిలిపేందుకు కృషి.

 


*- ఎపిఎండిసి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి షమీమ్ అస్లాం*

*- ఘనంగా స్వాగతం పలికిన ఎపిఎండిసి అధికారులు*

*- సీఎం శ్రీ వైయస్ జగన్ ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారు*

*- మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి శ్రీ మిధున్‌ రెడ్డిల సహకారంతో ముందుకు సాగుతాం*

*- రాష్ట్రంలోనే ఎపిఎండిసిని ప్రగతి పథంలో నిలిపేందుకు కృషి*


*- ఖనిజాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యత*


*: శ్రీమతి షమీమ్ అస్లాం* 


విజయవాడ (ప్రజా అమరావతి);


ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎపిఎండిసి) చైర్‌పర్సన్‌గా శ్రీమతి షమీమ్ అస్లాం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా  విజయవాడ లోని ఎపిఎండిసి కార్యాలయంకు చేరుకున్న శ్రీమతి షమీమ్ అస్లాంకు ఎపిఎండిసి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి అభినందలు తెలియచేశారు. అనంతరం ఎపిఎండిసి చైర్ పర్సన్‌ ఛాంబర్‌లో ఫైల్‌పై సంతకం చేసి, అధికారికంగా శ్రీమతి షమీమ్ అస్లాం బాధ్యతలు స్వీకరించారు. 

ఈ సందర్భంగా ఆమె మీడియాతో  మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఈ రాష్ట్రంలో మహిళా సాధికారతకు చేస్తున్న కృషి, మహిళా శక్తిని రాష్ట్ర అభివృద్ధిలో భాగం చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగానే తనకు ఈ బాధ్యతలు అప్పగించారని అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిల సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో ఎపిఎండిసిని మరింత ముందుకు తీసుకువెడతానని అన్నారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయని, వాటిని సద్వినియోగంలోకి తీసుకురావడం, పారిశ్రామిక అభివృద్ధికి చేయూతను అందించడం, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రధానంగా తనపై ఎంతో నమ్మకంతో సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఈ బాధ్యతను ఉంచారని, దీనిని నిలబెట్టుకోవడంతో పాటు ఈ రాష్ట్రంలో ఎపిఎండిసి ప్రభుత్వరంగ సంస్థగా అందరికీ ఆదర్శప్రాయంగా ప్రగతిపథంలో నడిచేలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి ఎపిఎండిసి విశేషమైన కృషి చేస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో మన ఖనిజాలకు మంచి మార్కెట్‌ను సాధించి తన ప్రత్యేకతను చాటుకుంటోందని అన్నారు. ఎపిఎండిసి ద్వారా అటు ప్రభుత్వానికి ఖనిజ సంపద ద్వారా ఆదాయాన్ని అందించడానికి, ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఉన్న అన్ని అవకాశాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారు. 

అనంతరం ఎపిఎండిసి కార్యాలయ అధికారులతో భేటీ అయ్యారు. సంస్థ పురోభివృద్ధికి ప్రజాప్రతినిధిగా తనకు ఉన్న అనుభవాన్ని వినియోగించుకోవాలని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సంస్థకు చేయూత లభించేలా చేయడంతో పాటు, అటు పర్యావరణం, ఇటు ప్రజల అవసరాలు, పారిశ్రామిక అవకాశాలను కూడా సమన్వయం  చేసుకుంటూ సంస్థను ముందుకు తీసుకువెళ్ళేందుకు అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపిఎండిసి జాయింట్ డైరెక్టర్ డి.శ్రీనివాసరావు,  కంపెనీ సెక్రటరీ ఆర్ మణికిరణ్‌, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) ఎస్‌విసి బోస్, జనరల్ మేనేజర్ (కోల్) లక్ష్మణరావు, విసి అండ్ ఎండి ఓఎస్‌డి శ్రీవెంకటసాయి, డిజిఎం (జియాలజీ) నతానియేలు, డిజిఎం (సివిల్) శంభుప్రసాద్, ఎఫ్‌ అండ్ ఎ శ్రీనివాసమూర్తి, డిజిఎం (హెచ్‌ఆర్‌డి) పి. సత్యనారాయణమ్మ, డిజిఎం (సిఎస్‌ఆర్) రాజారమేష్‌, ఎఫ్‌ అండ్ ఎ దేవిమంగ తదితరులు పాల్గొన్నారు.