డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వన్‌ టైం సెటిల్‌మెంట్ అమలుకు సిద్దం కావాలి.

 

అమరావతి (ప్రజా అమరావతి);


- సచివాలయంలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

- సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ ధర్మాన కృష్ణదాస్, శ్రీ బొత్స సత్యనారాయణ, శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దొరబాబు.

- హాజరైన సిసిఎల్‌ఎ నీరబ్ కుమార్‌ ప్రసాద్‌, స్పెషల్ సిఎస్ (రిజిస్ట్రేషన్స్ & ఎక్సైజ్) రజత్ భార్గవ్,   స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ (హౌసింగ్) అజయ్ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ (ల్యాండ్, ఎండోమెంట్స్ &డిఎం- రెవెన్యూ)  వి.ఉషారాణి, ప్రిన్సిపల్ పిఆర్‌&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎండి (హౌసింగ్) నారాయణ్‌ భరత్ గుప్తా, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ కమిషనర్ శేషగిరిరావు తదితరులు


సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ....


- రాష్ట్రంలో లక్షలాధి మంది పేదలకు మేలు చేసేందుకే సీఎం శ్రీ వైయస్ జగన్ పెద్ద మనస్సుతో వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీంను ప్రకటించారు.

- ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 67 లక్షల మంది పేదలకు లబ్ధి జరుగుతుంది.

- డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వన్‌ టైం సెటిల్‌మెంట్ అమలుకు సిద్దం కావాలి.


- ఈ పథకం అమలులో ఉన్న సాదకబాధకాలను కూలంకశంగా పరిశీలించాలి.

-1980-2011 వరకు ఉన్న ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు విడిపించుకునే అవకాశం పేదలకు లభిస్తోంది.

- పేదల ఇళ్ళపై వారికి పూర్తి హక్కు వస్తుంది.

- రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, ఇతరులకు తమ అవసరాల కోసం విక్రయించుకునే వెసులుబాటు వస్తుంది.

- తమ ఆస్తులపై బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం వస్తుంది.

- రెవెన్యూ, పంచాయతీరాజ్‌, గృహనిర్మాణం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సర్వే విభాగాలు సమన్వయంతో పనిచేసి అర్హులను గుర్తించాలి.

-గ్రామాల్లో వన్‌ టైం సెటిల్‌మెంట్ కింద అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద లబ్ధి పొందాలి

- గతంలో ప్రభుత్వం నుంచి పట్టాలు పొంది, తరువాత అనధికారికంగా ఇతరులకు విక్రయించిన పరిస్థితుల్లో సదరు ఇంటిపై హక్కులను కల్పించే విషయంలో శాస్త్రీయంగా ఒక విధానంను రూపొందించాలి.

- ఇప్పటికే స్వామిత్వ పథకం కింద రాష్ట్రం మొత్తం భూరికార్డుల ప్రక్షాళన జరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే ఆ వివరాలను కూడా పరిశీలించాలి