అర్హత ఉన్న ప్రతి మహిళలకు నాలుగేళ్ళలో మొత్తం రూ.75 వేలరూపాయలను వైయస్‌ఆర్ చేయూత కింద అందిస్తున్నాం


అమరావతి (ప్రజా అమరావతి);


- సచివాలయంలో వైయస్‌ఆర్‌ చేయూతపై మంత్రుల కమిటీ సమావేశం

- సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ అజేయకల్లాం

- హాజరైన అధికారులు పిఆర్‌&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, సెర్ఫ్ సిఇఓ ఇంతియాజ్, మెప్మా డైరెక్టర్ విజయలక్ష్మి తదితరులు

- సమావేశంకు హాజరైన పలు మల్టీనేషన్ కంపెనీల ప్రతినిధులు


సమీక్ష సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ...


- మహిళలను ఆర్థికంగా బలపేతం చేసేందుకు సీఎం శ్రీ వైయస్‌ జగన్ వైయస్‌ఆర్ చేయూత పథకానికి రూపకల్పన చేశారు.

- అర్హత ఉన్న ప్రతి మహిళలకు నాలుగేళ్ళలో మొత్తం రూ.75 వేలరూపాయలను వైయస్‌ఆర్ చేయూత కింద అందిస్తున్నాం


- 45-60 మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మహిళలు ఆర్థికంగా తమ కుటుంబాలకు అండగా నిలిచేలా వారికి చేయూతను అందించాలన్న సీఎం గారి లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలి.

- 2020 అక్టోబర్ 12వ తేదీన మొదటి విడత వైయస్‌ఆర్ చేయూత కింద 24,00,111 మంది అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.4500.20 కోట్లు జమ చేశాం.

- మహిళల్లో వ్యాపార దక్షత పెంచేందుకు ఇచ్చిన ప్రోత్సాహంతో గత ఏడాది 78 వేల రిటైల్ షాప్‌లు ప్రారంభించారు.

- 1.19 లక్షల పశువులను, 70,955 జీవాలను కొనుగోలు చేశారు.

- రెండో విడత వైయస్‌ఆర్ చేయూత కింద ఈ ఏడాది జూన్ 22న రాష్ట్ర వ్యాప్తంగా 22,38,648 మంది మహిళలకు ఖాతాలకు సొమ్ము జమ చేశాం.

- ఇందు కోసం ప్రభుత్వం మొత్తం రూ.4197.46 కోట్లు కేటాయించింది.

- మహిళల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచి, వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఈపథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

- మొదటి ఏడాది వైయస్‌ఆర్ చేయూత కింద మహిళలతో పి&జి, ఐటిసి, హెచ్‌యుఎల్, రిలయన్స్ రిటైల్, అమూల్, అల్లానా సంస్థలు వ్యాపార ఒప్పందాలు చేసుకున్నాయి.

- రెండో ఏడాది ఎజియో రిలయన్స్, టానాజర్, జివికే, మహేంద్రా టాప్ & ఖేతి, గెయన్ వంటి సంస్థలు వ్యాపార ఒప్పందాలకు ముందుకు వచ్చాయి. 

- ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా పెద్ద ఎత్తున రిటైల్ స్టోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు కృషి చేయాలి.

- ఈ సంవత్సరంలో అదనంగా 60వేల లైవ్ స్టాక్‌ను కొనుగోలు చేసేందుకు లబ్ధిదారులు ఉత్సాహంగా ఉన్నందున దానిపై దృష్టి సారించాలి.

-  కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో 1500షెడ్ నెట్ హౌస్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి.

- రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులకు బ్రాండింగ్ ఏర్పాటు చేస్తూ, చేయూత స్టోర్స్‌లో విక్రయించేలా చర్యలు తీసుకోవాలి.

- మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఉత్పత్తులను కూడా చేయూత కింద ఒప్పందాలు చేసుకున్న మల్టీనేషన్ సంస్థల ద్వారా విక్రయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి.

- నియోజకవర్గాల స్థాయిలో బ్యాంకింగ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేసి చేయూత కింద జీవనోపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు సులభంగా లభించేలా అధికారులు చొరవ తీసుకోవాలి.

- అలాగే బ్యాంకుల నుంచి రుణాలు పొంది వ్యాపారాలు చేసుకుంటున్న లబ్ధిదారులు సకాలంలో తిరిగి చెల్లింపులు జరిగేలా ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా అధికారులు వారిలో అవగాహన పెంచాలి.

- రుణాల చెల్లింపులు సక్రమంగా ఉంటేనే తిరిగి బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తాల్లో రుణ సదుపాయం ఉంటుంది.

- గత ఏడాది కేటాయించిన లైవ్‌స్టాక్స్‌ లక్ష్యంను ఈ ఏడాది మరింత పెంచాలి.

- చేయూత కింద మహిళలతో వ్యాపార కార్యకలాపాల కోసం ఒప్పందాలు చేసుకున్న సంస్థలు కూడా వారి జీవనోపాధి మెరుగుదలకు తోడ్పాటును అందించాలి.