పేద ప్రజల స్వయం ఉపాధి కి అండగా ఆర్ధిక భరోసా గా ఆసరా.. లబ్దిదారులమనోగతం


కొవ్వూరు (ప్రజా అమరావతి);



పేద ప్రజల స్వయం ఉపాధి కి అండగా ఆర్ధిక భరోసా గా ఆసరా.. లబ్దిదారులమనోగతం



రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకం గా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తూ పేదల కుటుంబా లలో పేదరికాన్ని నిర్ములించి పేదల కుటుంబాలల్లో ఆర్థిక భరోసా ను కల్పించడం జరుగుతోంది అని కొవ్వూరు పురపాలక కమీషనర్, కె. టి. సుధాకర్ అన్నారు. రాష్ట్ర ము ఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మో హన్ రెడ్డి ప్రత్యేకంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలు పరచడం జరిగిం దన్నారు వై. ఎస్. ఆసరా పధకం ద్వారా పేద మహిళలు కు ఆర్థికము గా భరోసా కల్పించడం జరిగింద న్నారు.  వై. ఎస్. ఆసరా పధకం ద్వారా పేద మహిళలు కు ఆర్థిక చేయుతని ఇచ్చి కిరాణా, ఫ్యాన్సీ దుకాణాలు పెట్టించి వారి కుటుంబా లలో వెలుగులు నింపడం జరిగింది అన్నారు. కొవ్వూరు పురపాలక సం ఘా సిటీ మిషన్ మేనేజర్, మెప్మా, ఎ. జ్యోతి మాట్లాడుతూ కొవ్వూరు పురపాలక సం ఘా పరిధి లో మొత్తం 743 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, ఆసరాకి  541 సంఘాలు అర్హత సాధించాయన్నారు.  వీటిలో ఆసరా కీ 5026 మంది అర్హత కలిగిన మహిళా సభ్యురాళ్లు ఉన్నారన్నారు. ఆసరా కింద  మండలం లో రూ. 17.28 కోట్లు మంజూరు కాగా, మొదటి విడత లో వారికి రూ.4.31 కోట్ల రూపాయలుమంజూరు చేశామని తెలిపారు.


లబ్ధిదారుల మనోగతం:

కొవ్వూరు పట్టణం, 15 వ వార్డు కు చెందిన టొంపల సోమాలమ్మ వారి అభిప్రాయాన్ని వివరిస్తూ నేను నం దిని డ్వాక్రా సంఘంలో చేరాను. నా భర్త పేరు రాము, మాకుటుంబం రెక్క ఆడితే కానీ డొక్కాడదని,  ఈ ఆసరా పధకం ద్వారా నాకు బ్యాంకు లోను వచ్చిందన్నారు. ఈ సొమ్ము తో సో మాలమ్మ కిరాణా స్టోర్స్ పెట్టుకొని నా కుటుంబాన్ని ఆసరాగా ఉంటున్నానని అన్నారు. ఆసరా ద్వారా 62308 రూపాయలు మంజూరు అయ్యిందని, మొదటి విడతగా 15577 రూపాయలు వచ్చాయని సంతోషం వ్యక్త పరిచారు. నాకు ఇంత సహాయం చేసి మా కుటుం బాన్ని ఆదుకున్నందుకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికీ కృత జ్ఞతలు తెలిపారు.


కొవ్వూరు పట్టణం 9 వ వార్డుకీ చెందిన సింహాద్రి లక్ష్మి వారి అభిప్రా యాన్ని వివరిస్తూ నాకు 75 వేల రూపాయలు బ్యాంక్ లోను వచ్చిం దని, నేను కొబ్బరి బొండాలు, కూల్ డ్రింక్స్ షాపు పెట్టుకొని నా కుటుం బాన్ని పోషించు కొంటున్నానని అన్నారు. వై. ఎస్. ఆర్. ఆసరా  పధకం ద్వారా  తొలి విడత లో 18028 రూపాయలు మంజూరు అయ్యాయని అన్నారు.  పేదల జీవితాల్ని కాపాడుతున్న ప్రభుత్వానికి అండగా ఉంటామని అన్నారు.


కొవ్వూరు అచ్చయమ్మ కాలనీ కీ చెందిన దివిలి రమ్య వారి అభి ప్రాయాన్ని తెలియజేస్తూ నేను అక్షయ పొదుపు సంఘం లో ఉ న్నానని, నాకు లక్ష రూపాయలు లోను వచ్చిందని అన్నారు. ఈ సొమ్ము తో టైలరింగ్ & మగ్గం వర్క్స్ వ్యాపారం ప్రారంభించడం జరిగింది అన్నారు. ఆసరా ద్వారా 30178 రూపాయలు మంజూరు అయ్యాయని, ఆసరా ద్వారా మొ దటి విడత గా 7,437 రూపాయలు వచ్చాయని అన్నారు. ఈ వ్యాపా రం నా కుటుంబ పోషణ కు చాలా ఉపయోగంగా ఉందని, నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను అ న్నారు. నాకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించి నా కుటుంబాన్ని ఆదుకుందని, మా జగనన్న కీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.




Comments