దశలవారీ మద్య నిషేధానికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉంది

 దశలవారీ మద్య నిషేధానికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉంది


గత ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలుంటే వాటిని 2934కి తగ్గించాం

43వేల బెల్టు షాపులను,4380 పర్మిట్ రూమ్ లను రద్దు చేశాం

గతంలో మద్యం షాపుల సమయాలు ఉ.10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకు ఉండగా ప్రస్తుతం ఆసమయాలను ఉ.11గం.ల నుండి రాత్రి 8గం.లకు పరిమితం చేశాం

2018-19లో 661 లక్షల మద్యం బాక్సులు విక్రయిస్తే 2021లో 224 లక్షల బాక్సులు వినియోగం

దశల వారీ మద్య నియంత్రణ చర్యలతో 63శాతం మద్యం వినియోగం తగ్గింది

        రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్,వాణిజ్యపన్నులు కె.నారాయణ స్వామి

అమరావతి,8 సెప్టెంబరు (ప్రజా అమరావతి):రాష్ట్రంలో దశల వారీ మద్యపాన నిషేదానికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్ మరియు వాణిజ్యపన్నుల శాఖ ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి పేర్కొన్నారు.బుధవారం అమరావతి సచివాలయం ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశల వారీ మద్య నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల 63శాతం మద్య వినియోగం తగ్గిందని గతంలో 4380 మద్యం దుకాణాలుంటే వాటిని ఈప్రభుత్వం 2వేల 934 షాపులకు అనగా 33శాతం  కుదించడం జరిగిందని తెలిపారు.అదే విధంగా 43వేల బెల్టు షాపులను పూర్తిగా రద్దు చేయడంతోపాటు 4380 పర్మిట్ రూమ్ లను కూడా రద్దు చేశామని చెప్పారు.మద్యం వినయోగాన్ని తగ్గించడానికి పేదలు మద్యానికి బానిస కాకుండా ఉండేందుకు మద్యం ధరలను పెంచడం జరిగిందని దాని మూలంగానే మద్యం వినియోగం 63 శాతం తగ్గిందని ఆయన స్పష్టం చేశారు.అంతేగాక గతంలో మద్యం దుణాకాణాల వేళలు ఉ.10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకూ ఉంటే ఆవేళలను ఉ.11గం.ల నుండి రాత్రి 8గం.లకు పరిమితం చేశామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పారు.అలాగే ఒక వ్యక్తి కలిగి ఉండే మద్యం బాటిళ్ళ సంఖ్య 6నుండి 3కు తగ్గించడం జరిగిందని తెలిపారు.రాష్ట్రంలో మద్య నిషేధ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నారాయణ స్వామి పేర్కొన్నారు.

నవరత్నాలు అమలు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాలను దోచుకున్నారని ఉప ముఖ్యమంత్రి  నారాయణ స్వామి అన్నారు.ఉద్యమం అంటే పేదల ఇళ్ళ స్థలాల కోసం లేదా రైతు సంక్షేమం కోసం లేదంటే పేదల సంక్షేమానికై చేయాలి తప్ప మద్యంపై ఉద్యమం చేయడం ఏమిటని ప్రతిపక్షాల తీరును విమర్శించారు. ప్రస్తుతం ఉన్నమద్యం ఉత్పత్తి డిస్టిల్లరీలు అన్నీ గత గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవేనని ఈప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క డిస్టిల్లరీనీ కూడా ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.అంతేగాక ఎపి డిస్టిల్లరీ రూల్స్ 2006 మద్యం తయారీకి అనేక ప్రమాణాలు  నిర్ణయించడం జరిగిందని ఆప్రకారమే మద్యం తయారు అవుతోందని చెప్పారు.ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రాష్ట్రంలోకి రవాణా చేయకుండా రాష్ట్ర సరిహద్దు చెక్కు పోస్టుల్లో సిసి కెమెరాల నిఘాను ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పారు.

స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో(SEB)ఏర్పాటుతో నమోదైన కేసులు:

రాష్ట్రంలో స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో ఏర్పాటు చేశాక గత ఏడాది మే నుండి ఇప్పటి వరకూ మద్యం అక్రమాలకు సంబంధించి లక్షా 14వేల 689 కేసులను నమోదు చేసి 2లక్షల 786 మందిని అరెస్టు చేయడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వెల్లడించారు.అలాగే 51వేల 103 వివిధ వాహనాలను స్వాధీనం చేసుకోవడం తోపాటు 7లక్షల 71వేల 288 లీటర్ల నాటు సారాను,2కోట్ల 19లక్షల 55వేల 812 బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు.అంతేగాక ఇతర రాష్ట్రాలకు చెందిన 7లక్షల 12వేల 557 లీటర్ల ఎన్డిపిఎల్ మద్యాన్ని,95వేల 238 లీటర్ల డ్యూటీ పెయిడ్ మద్యాన్ని,2లక్షల 49వేల 162 కిలోల గంజాయిని స్వాధీన పర్చుకున్నామని ఉప ముఖ్యమంత్ర నారాయణ స్వామి వెల్లడించారు.

    

Popular posts
దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొడాలి నాని
Image
ముఖ్యమంత్రి హెూదాలో పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టిన వైఎస్సార్ ను ఎలా మర్చిపోగలం
Image
ప్రజల గుండెల్లో చురస్మరణీయమైన స్థానం పొందిన వ్యక్తి నారా లోకేష్
Image
ఎన్టీఆర్ అభిమానిగా సీఎం జగన్మోహనరెడ్డికి పాదాభివందనం చేస్తున్నా
Image
మెడల్ హౌస్.... - రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు - 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం - కరీంనగర్‌లో యువబిల్డర్ ప్రయోగం సక్సెస్ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు. ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది. నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్ది గా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది. ఖర్చు పెట్టారిలా: గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. చైనా, జర్మనీల్లో చూసి ప్లాన్‌చేశారు పేరాల కృష్ణారావు, ఎండీ, వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించారు. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. పేద ప్రజల కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి మోడల్ హౌస్ అని పేరుపెట్టారు
Image