వైసీపీ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడింది

 


 *వైసీపీ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడింది* 


 *జగన్ రెడ్డి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై రైతు కోసం తెలుగుదేశం పేరుతో  రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13 నుంచి 17 వరకు 5 రోజుల పాటు నిరసనలు* 


 *జగన్ రెడ్డి రైతులకు చేస్తున్న అన్యాయం, మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలి* 


- *కింజరాపు అచ్చెన్నాయుడు* 


వైసీపీ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని,  జగన్ రెడ్డి రైతులకు చేస్తున్న మోసం, అన్యాయాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ రైతు కోసం తెలుగుదేశం పేరుతో ఈనెల 13వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శనివారం నాడు 25 పార్లమెంటరీల టీడీపీ అధ్యక్ష్యులు, 175 నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జులతో అచ్చెన్నాయుడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు.  ఈ టెలికాన్పరెన్స్ లో  అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..... జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, రైతుల పట్ల నిర్లక్ష్య తీరుకు నిరసనగా  రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం పేరుతో  ఈనెల 13 వ తేదీ నుంచి 17 వరకు తేదీ వరకు జోన్ల వారీగా రాష్ర్టంలోని 5 జోన్లలో  రోజుకొక జోన్ లో నిరసనలు తెలపాలని పార్టీ అదిష్టానం నిర్ణయించింది. ఈ నిరసన కార్యక్రమాల్లో 25 పార్లమెంటరీ  పార్టీ అద్యక్ష్యులు, 175 నియోజకవర్గాల ఇన్ చార్జులు,  ఎమ్మెల్యేలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. 


 *రైతు కోసం తెలుగుదేశం  నిరసన కార్యక్రమాల వివరాలు*

 

13 .09.2021  జోన్ – 1  

అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్లలోని 35 నియోజవకర్గాల్లో నిరసనలు 

14.09.2021 – జోన్ - 5

నంద్యాల, కర్నూలు, అనంతపురం, ‍హిందూపురం, కడప పార్లమెంట్లలోని 35 నియోజకవర్గాల్లో నిరసనలు 

15.09.2021 – జోన్ – 2 

కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ లలోని 35 నియోజకవర్గాల్లో నిరసనలు

16.09.2021 – జోన్ - 4 

 ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంట్ లలోని 35 నియోజకవర్గాల్లో నిరసనలు

17.09.2021 -  జోన్ -3

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావు పేట, బాపట్ల పార్లమెంట్ లలోని 35 నియోజకవర్గాల్లో నిరసనలు

Popular posts
దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొడాలి నాని
Image
ముఖ్యమంత్రి హెూదాలో పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టిన వైఎస్సార్ ను ఎలా మర్చిపోగలం
Image
ప్రజల గుండెల్లో చురస్మరణీయమైన స్థానం పొందిన వ్యక్తి నారా లోకేష్
Image
ఎన్టీఆర్ అభిమానిగా సీఎం జగన్మోహనరెడ్డికి పాదాభివందనం చేస్తున్నా
Image
మెడల్ హౌస్.... - రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు - 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం - కరీంనగర్‌లో యువబిల్డర్ ప్రయోగం సక్సెస్ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు. ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది. నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్ది గా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది. ఖర్చు పెట్టారిలా: గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. చైనా, జర్మనీల్లో చూసి ప్లాన్‌చేశారు పేరాల కృష్ణారావు, ఎండీ, వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించారు. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. పేద ప్రజల కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి మోడల్ హౌస్ అని పేరుపెట్టారు
Image