జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి పేర్నినాని తీవ్ర విమర్శలు.!

 తాడేపల్లి (ప్రజా అమరావతి):


*జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి పేర్నినాని తీవ్ర విమర్శలు.!* 

 

ప్రభుత్వం థియేటర్లను మూసివేయించిందని పవన్‌ వ్యాఖ్యానించారు, ఏపీలో 1100 థియేటర్లు ఉంటే 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయ్


*తెలంగాణలో 519కి గానూ 413 థియేటర్లలో మాత్రమే సినిమాలు ఆడుతున్నాయ్*


 తెలంగాణలో కంటే ఏపీలోనే సినీ నిర్మాతలకు ఎక్కువ షేర్‌ వస్తోంది


*సినీ ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందిపెట్టిందో పవన్‌ చెప్పాలి? అని మంత్రి ప్రశ్న*


పవన్‌కు కేంద్రంలో సినిమా లేదని.. అంతా సొల్లు చెబుతారని విమర్శించారు.


 *టాక్స్‌లు, జిఎస్టీ ఎందుకు కట్టాలని కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచన*


తమ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో పవన్‌ కల్యాణ్‌ చెప్పాలని సూటిగా ప్రశ్న


*రిపబ్లిక్‌ ఇండియా కాబట్టే.. మీరు ఏం వాగినా చెల్లుతోందన్న మంత్రి పేర్నినాని*


 కోడికత్తి కేసును ఎన్ఐఏ విచారిస్తోందని, వివరాలు అమిత్‌షాను అడిగి తెలుసుకోండని సూచన


*'మా' ఎన్నికల్లో ఓట్ల కోసమే పవన్‌ తాపత్రయం*


వకీల్‌సాబ్‌ సినిమాకు ఏపీలో వచ్చిన నిర్మాతల షేర్‌ రూ.50 కోట్లపైనే అని తెలిపారు. 


*వకీల్‌సాబ్‌ సినిమాకు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ షేర్‌ వచ్చింది*


పవన్‌కల్యాణ్‌ ఇష్టానుసారం మాట్లాడితే తాట తీస్తామని మంత్రి పేర్నినాని హెచ్చరించారు. 


*రెండు చోట్లా ఓడిపోయినవాడు సన్నాసి కాదా? అని ఆయన ప్రశ్నించారు.*


*తాను సన్నాసి అయితే.. పవన్‌ సన్నాసిన్నర అని మండిపడ్డారు.*


 *ప్రభుత్వంపై పవన్‌ అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.*

Comments