బద్వేలు ఉపఎన్నిక ముగిసే సమయానికి 72గం.ల ముందు ప్రచారం నిలిపివేయాలి:సిఇఓ

 

బద్వేలు ఉపఎన్నిక ముగిసే సమయానికి 72గం.ల ముందు ప్రచారం నిలిపివేయాలి:సిఇఓ

అమరావతి,21అక్టోబరు (ప్రజా అమరావతి):ఈనెల 30వతేదీన కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసే సమయానికి 72గం.ల ముందు అనగా (ఈనెల 27వతేదీ సా.7గం.ల నుండి 30వతేదీ సా.7గం.ల వరకూ)ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని నిలిపి వేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మరియు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ తెలియ జేశారు.పోలింగ్ ముగిసే సమయానికి 72గం.ల ముందు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయరాదని ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా తోపాటు ఇతర మార్గాల్లోను ప్రచారం చేయడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు.1951 ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 126(1)(బి) ప్రకారం పోలింగ్ సమయం ముగిసే 72గం.ల ముందు ఎన్నికల ప్రచారానికి సంబంధించి పోలింగ్ జరిగే ప్రాంతంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సినిమాటోగ్రఫీ,టెలివిజన్ చానళ్ళు లేదా ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా గాని ఎలాంటి ప్రచారాలు నిర్వహించడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు.అదేవిధంగా పోలింగ్ ముగిసేందుకు 72గం.ల ముందు అనగా ఈనెల 27వతేదీ సా.7గం.ల నుండి 30వతేదీ సా.7గం.ల వరకూ ఒపీనియన్ పోల్ లేదా పోల్ సర్వేకు సంబంధించిన వివరాలను గాని ఎలక్ట్రానికి మీడియా చానళ్ళ ద్వారా ప్రచారం చేయడం లేదా వెల్లడించాన్నినిషేధించడం జరిగిందని సిఇఓ విజయానంద్ స్పష్టం చేశారు.


Comments