శ్రీ కనక దుర్గ అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

 ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి);

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా. ఐదో రోజైన సోమవారం శ్రీ కనక దుర్గ అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.


రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ అన్నపూర్ణ దేవి అవతారం లో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం వీడియో పాయింట్ నుండి మంత్రి మాట్లాడుతూ...


మూలా నక్షత్రం రోజైన మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని ఇందుకు తగిన విధంగా  అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు రానున్నారని మంత్రి తెలిపారు.


ఎటువంటి లోటు పాట్లు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. మూలా నక్షత్రం రోజున భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని తగినవిధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శ్రీనివాస్ అన్నారు.


నిన్న ఆదివారం 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని మంత్రి అన్నారు.Comments