ఉద్యోగులకు ఏ సమస్యలున్నా ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది.తాడేపల్లి


ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం. (ప్రజా అమరావతి);-ఉద్యోగులకు ఏ సమస్యలున్నా ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది.


-ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చర్చలు కొనసాగుతాయి.


-వచ్చే నెలాఖరులోపు ఉద్యోగుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.


-వచ్చే నెల నుంచి ఉద్యోగుల వేతనాలు సకాలంలో ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.


-ప్రభుత్వం అన్ని ఉద్యోగ సంఘాలను సమానంగా చూస్తుంది.


-ఉద్యోగ సంఘాల వ్యవహారంలో రాజకీయాలు చొప్పించాలని చూస్తే వారు ఫూల్స్ అవుతారు.


ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద మీడియాతో ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి


వచ్చే నెలాఖరులోపు రాష్ర్టప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలనే దిశగా రాష్ర్ట ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ప్రభుత్వ సలహాదారులు (ప్రజావ్యవహారాల) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

మంగళవారం నాడుఏపి ఎన్జీఓ,ఏపి ఎన్జీఓ అమరావతి ఉద్యోగసంఘాల జేఏసి నేతలు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డిని కలసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం అందచేశారు. ఆ నేపధ్యంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం నాడు ఉద్యోగ సంఘాల నేతలు,ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి,ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ధనుంజయరెడ్డిలతో సమావేశమయ్యారు. రాష్ర్టంలో ఉద్యోగులు పే రివిజన్ కమీషన్ సిిఫార్సుల అమలు,సకాలంలో వేతనాలు అందచేయాలని,సిపిఎస్ రద్దు వంటి పలు సమస్యలను ప్రస్తావించారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిధ్దంగా ఉందని అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అన్ని ఉద్యోగసంఘాలతో సమావేశం ఏర్పాటుచేసి విస్ర్తుతస్ధాయిలో చర్చించిన తర్వాత ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

 ఉద్యోగసంఘాల నేతలతో సమావేశం అనంతరం శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి  ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.


శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే......


1. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019లో ఏర్పాటుచేశాక ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగంగా, ప్రభుత్వానికి సంభందించినంత వరకు కార్యనిర్వాహకులుగా, క్షేత్రస్ధాయిలో ప్రభుత్వ విధానాల అమలుగాని,శ్రీ వైయ్స జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల అమలు గాని వారి భుజస్కంధాల మీదనే

ఉందనేది స్పష్టం చేశాం.


2. దాని ఫలితంగానే అందరూ గమనించేఉంటారు గత ప్రభుత్వంలోలాగా ఉద్యోగులలో గ్రూపులను రాజకీయాలకోసం వాడుకోవడం అనేది శ్రీ వైయస్ జగన్ గారు ఎంటర్ టైన్ చేయకూడదనుకున్నారు.ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతోంది.


3. ఉద్యోగులపై అంత బాధ్యత ఉన్నప్పుడు ఉద్యోగుల సంక్షేమం గురించి,వారి భవిష్యత్తు,వారి కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించి,ఉద్యోగుల భధ్రతకు సంబంధించి శ్రీ వైయస్ జగన్ గారు రెండడుగులు ముందే ఉంటారు. 


4. మీరు గమనిస్తే అంతకుముందు అవుయట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఇబ్బందులు ఉంటే అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ఏర్పాటుచేయడం,ఎక్కడైనా కాంట్రాక్ట్ ఉద్యోగులను సర్వీసులోకి తీసుకోవాలన్నచోట అందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది.ఆర్టిసిని ప్రభుత్వంలో తీసుకోవాలనే దీర్ఘకాల డిమాండ్ ను నెరవేర్చి ప్రభుత్వంలో విలీనం చేశారు.లక్షా 30 వేల నూతన ఉద్యోగాలను క్రియేట్ చేయడం సిస్టమ్ ను కిందివరకు వికేంద్రీకరించి కొద్ది మంది పై ఉన్న బాధ్యతను అందరికి ఉండేలా చేశారు.అందరూ ఇన్ వాల్వ్ అయ్యేలా చూడటం జరిగింది.


5.ఉద్యోగులకు సంబంధించి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించడం జరుగుతోంది.ముఖ్యమంత్రిగారు బిజీగా ఉన్నా నాలాంటి వాళ్లు,అధికారులు ఎక్కడికక్కడ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతోంది.అయితే గత ఏడాది కోవిడ్ వచ్చిన దగ్గర్నుంచి ఆర్దికపరిస్ధితి ఇబ్బందికరంగా ఉండటం,ఊహించని ఖర్చులు రావడం వీటన్నింటి వల్ల ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కావడం వల్ల అదనపు బరువు మోయాల్సి రావడం జరిగింది.


6.వీటన్నింటివల్ల కొంత వత్తిడికి గురికావడం,చిన్న చిన్న సమస్యలు అవి కొంత కొంత పెద్దవి కావడం,ఆ సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు మాతో మాట్లాడటం,చర్చలు జరపడం జరుగుతోంది.ఎక్కడా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూస్తున్నాం.


7.ఈ క్రమంలో భాగంగానే చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పిఆర్ సి అమలు,కంట్రిబ్యూటరీ పెన్సన్ స్కీమ్ రద్దు,కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ సమస్యలు వంటి పలు అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.ఈ మధ్యలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మారడం దాని వల్ల కొంత డిలే అయింది.అతి పెద్ద కారణం కోవిడ్.దాని ప్రభావం ఏడాదిన్నర పైగానే ఉంది.


8. పిఆర్ సి కి సంబంధించినంతవరకు ఇంటిరియమ్ రిలీఫ్ డిక్లేర్ చేయడం ద్వారా ఆర్ధికంగా పెనుభారం అయినప్పటికి ఏదైతే శ్రీ వైయస్ జగన్ హామీ ఇచ్చారో దానిని నెరవేర్చారు.ఇంటిరీయమ్ రిలీఫ్ ఇచ్చిన నేపధ్యంలో పిఆర్ సి ఇంప్లిమెంటేషన్ కొంత డిలే అవుతూ వచ్చింది.అది చాలా కాలమైంది ఏదో ఒకటి తేల్చాలనే దిశగా ప్రభుత్వం ఉన్న నేపధ్యంలో నిన్న ఉద్యోగ సంఘాల జేఏసి వచ్చి కోరడంతో నిన్న,ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది.


9.పిఆర్ సి కి సంబందించి ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాం.అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అన్ని ఉద్యోగసంఘాల నేతలతో కలసి చర్చలు సాగుతాయి.మొత్తంమీద వచ్చే నెలాఖరుకల్లా ఉద్యోగులకు సంబంధించి ప్రధానసమస్యలను అడ్రస్ చేద్దాం అని ప్రభుత్వం భావిస్తోంది.వారి ప్రధాన డిమాండ్లను అందరికి అమికబుల్ గా డిజాల్వ్ చేద్దామని భావిస్తోంది.


10.ఏడాదికి పదివేల కోట్ల రూపాయల అదనపు భారం పడినప్పటికి అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చిన ప్రభుత్వం ఇది.ఉద్యోగులెవ్వరూ కూడా ఈ ప్రభుత్వంపై అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.శ్రీ వైయస్ జగన్ గారి విధానం ఒక్కటే.ఉద్యోగులను విడగొట్టడం లేదా వారి మధ్యన ఉన్న స్పర్ధలను వాడుకుని రాజకీయంగా ఏదో చేయాలనుకోవడం అనేదాన్ని ఆయన ఒప్పుకోరు.


11.ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదు.సిస్టమ్ లో పార్ట్.మా విధానాలు ,శ్రీ వైయస్ జగన్ గారి ఆలోచనలు అమలు జరగాలంటే ఆ బాధ్యత,బరువు మోసేది ఉద్యోగులే.కాబట్టి అందరికంటే వారిని సంతృప్తి పరచటం,తన టీమ్ లో పార్ట్ గా చూడటం ఆయన మౌళికమైన ఆలోచన.ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు.అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.ఇంతపెద్ద సిస్టమ్ లో కొన్ని సందర్భాలలో కొన్ని డిలే అవుతుంటాయి.వాటిని పరిష్కరించడానికి రాజకీయంగా వచ్చిన నాలాంటి వాళ్లు గాని,ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు గాని ఉన్నాం.


12.మొత్తం మీద నెలా...నెలన్నరలో సమస్యలు డిజాల్వ్ అవుతాయి.జీతాలకు సంబంధించి కూడా జాప్యం నివారించి వచ్చే నెలనుంచి సకాలంలో అందేలా చేయడం జరుగుతుంది.దానిపై కూడా అధికారులు ఫోకస్ పెడుతున్నారు.ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ దానిపై డైరక్షన్స్ ఇచ్చారు.భవిష్యత్తులో ఆ సమస్య ఉండదనే విధంగా హామీ ఇవ్వగలుగుతున్నాం.ఏది ఏమైనా శ్రీ వైయస్ జగన్ విధానాలు అమలు చేయాలంటే పైనుంచి కిందిస్ధాయి వరకు ఉద్యోగులందరి సహకారం అవసరం.వారి ఇన్ వాల్వ్ మెంట్ ఉంటేనే అన్ని సఫలమవుతాయి.


13.శ్రీ వైయస్ జగన్ ఒక రాజకీయనాయకుడిగా కాకుండా సమాజంలో మిగిలిన వర్గాలన్నింటిని అక్కున చేర్చుకుంటున్నారో అదే విధంగా ఉద్యోగులను భావిస్తారు.అందులోను తన ఆలోచనలను అమలు చేసే అత్యంత కీలకమైన వర్గమైన ఉద్యోగులను మరింత ఆప్యాయంగా చూసుకుంటారు.ఆ నమ్మకం,భరోసా ఉద్యోగులలో కూడా ఉంది కాబట్టి ఇది పెద్ద సమస్యగా మేం భావించడం లేదు.నాయకుల సహకారంతో త్వరలోనే ఈ సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని హామీ ఇస్తున్నాం.వచ్చే నెలాఖరుకల్లా ప్రధాన డిమాండ్లన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి.


14. ఈనెల 18,19 తేదీలల ఛీఫ్ సెక్రటరీ ఆద్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరుగుతాయి.సానుకూల పరిష్కారం లభిస్తుంది.


అధికారులతో చర్చలకు కొన్ని సంఘాలనే పిలిచారు అనే విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇక్కడ అలాంటి వాటికి ఆస్కారం లేదు.నిన్న జేఏసి నేతలు వినతిపత్రం ఇచ్చిన నేపధ్యంలో వీరితో ఈరోజు చర్చించడం జరిగింది.అంతకుముందు కూడా   సెక్రటేరియట్ ఉద్యోగ సంఘం,వేరే సంఘాల వారితో సైతం చర్చించడం జరిగింది.అందరూ ఒకటే డిమాండ్ పిఆర్ సి పై త్వరగా తేల్చండి అని అడుగుతున్నారు.గత ఛీఫ్ సెక్రటరీ సమయంలోనే ఒక కొలిక్కి వచ్చింది.ఆయన ఉద్యోగ విరమణ చేయడం,కొత్త ఛీఫ్ సెక్రటరీ రావడం వల్ల మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది.ఇందులో ఒకరిని పిలిచి మాట్లాడటం అనే ప్రశ్న రాదు.ఆ ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయం.ఉద్యోగుల నాయకులే కాదు.ఉద్యోగులు వచ్చినా కూడా మేం రియాక్ట్ అవుతాం.అందరకి సమాన ప్రాధాన్యం ఉంటుంది.ఈరోజు వీళ్లు వచ్చారు కాబట్టి వీరితో మాట్లాడాం.సోమవారం వేరే సంఘాల నేతలు వస్తే వారితో కూడా మాట్లాడటం జరుగుతుంది.


త్వరలో ఛీఫ్ సెక్రటరీ తో చర్చలు జరుగుతాయి.అప్పుడు అందరూ రిప్రజెంట్ చేయవచ్చు.అవి కీలక చర్చలు అవుతాయి.ఈరోజు రెండు జేఏసిలు వినతిపత్రం ఇచ్చాయి.వీరితో చర్చించాం.పారదర్శకంగా ఉండేందుకే ఈ విషయం స్పష్టం గా చెబుతున్నాం.


ఈ రెండు జేఏసిలనే మీరు ఫోన్ చేసి అభినందించారు. మిగిలిన సంఘాలను ఎందుకు అభినందించడం లేదని పలువురు అడుగుతున్నారని విలేకరి అడిగిన ప్రశ్నపై మాట్లాడుతూ అసలు ఇన్ని సంఘాలు కాకుండా ఒకటే సంఘం ఉంటే మాకు డీల్ చేయడం ఈజీ అవుతుంది. రెండు సంఘాలు కలిస్తే మంచిది. మిగిలినవారు కూడా కలవండి మంచిది అని చెప్పాను. మాకు గత ప్రభుత్వానికి ఒక్కటే తేడా. చంద్రబాబు ఎంతమంది విడివిడిగా ఉంటే అంతగా డీల్ చేస్తుండేవారు. మా ప్రభుత్వం అందరూ కలిసి ఒకటిగా ఉంటే డీల్ చేయడం సులభం అని అనుకుంటాం. కాబట్టి మిగిలినవారు కూడా కలిస్తే ఆహ్వానిస్తాం. ఇదేదో రహస్యంగా చేేసేదికాదు.మేం పారదర్శకంగా చెబుతున్నాం. మాది ప్రో ఎంప్లాయిస్ గవర్నమెంట్. ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అని చెప్పే ప్రభుత్వం. సమస్యలుంటే పరిష్కరిస్తాం. నిజంగా రాజకీయం చేయదలుచుకుంటే రాగానే ఐఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గొడవ చేసిన తర్వాత చేయవచ్చు. మేం ఉద్యోగుల పక్షాన ఆలోచిస్తాం. దీంట్లో రహస్యం ఏమీ లేదు. ఇలాంటి వాటిల్లో రాజకీయం చొప్పించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్లే ఫూల్స్ అవుతారు. మీ మీడియాలో అయినా ఎవరైనా స్ర్టైక్ చేస్తుంటే ఎవరో ఒకరు మాట్లాడతారు. ఇది కామన్ ఫ్యాక్టర్. సమస్యలున్నప్పుడు అధికారికంగా మాట్లాడతారు. కొందరు అనధికారికంగా కూడా మాట్లాడతారు. ఏదైనా సమస్య పరిష్కారం కావాలనేది అంతిమంగా కోరుకుంటారు. మీడియాలో కొందరి తాపత్రయం ఏందో అర్ధం కావడం లేదు. ఉద్యోగసంఘాలకు ఫోన్ చేయడాన్ని కూడా మీకు అంతర్జాతీయ రహస్యం ఏదో మీకు దొరికినట్లు దాన్ని హైలెట్ చేశారు. దాంట్లో వింతేముందో అర్దం కాలేదు. ఎంప్లాయిస్ ఏమైనా అవుట్ సైడర్స్ కాదు కదా. వారికి సమస్య ఉన్నప్పుడు అడగటం సాధారణంగా జరిగేదే. అదేదో రహస్యం కనిపెట్టినట్లు చేశారు. అది రహస్యం అయితే బండి శ్రీనివాసరావుగారు అక్కడే ఎందుకు ఫోన్ లో మాట్లాడతారు. పక్కకు వెళ్లే మాట్లాడేవారు కదా. సమస్య ఉంటే దానిని తెలుసుకుని పరిష్కరించేదిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.సమస్య పరిష్కారం కోసం అన్ని మార్గాలను వినియోగించుకుంటాం అని స్పష్టం చేశారు.


విలేకరులతో మాట్లాడిన సమయంలో ఏపి ఎన్జీఓ సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు,ఏపి జేఏసి అమరావతి అధ్యక్షుడు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments