శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం   శ్రీ కపిలేశ్వరాలయంలో

అన్నాభిషేకం


        

 తిరుపతి (ప్రజా అమరావతి):

     శ్రీ‌నివాస‌మంగాపురం స‌మీపంలోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద గ‌ల శ్రీ వేంకటేశ్వ‌ర‌ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం బుధవారం శాస్త్రోక్తంగా జరిగింది.


 ఇందులో భాగంగా ఉద‌యం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి అభిషేకం, హోమాలు, పూర్ణాహుతి, ఆవాహ‌న, అర్చ‌న నిర్వ‌హించారు.

  శ్రీ భోగ‌శ్రీ‌నివాస‌మూర్తి ఉత్సవమూర్తిని ప్ర‌తిష్టించారు. 

 ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వహించారు. 


 ఈ సందర్భంగా ...

పద్మప్రదక్షిణ, 

జీవకళాన్యాసం, 

బ్రహ్మఘోష, 

ఆశీర్వచనం తదితర కార్యక్రమాలు చేపట్టారు.


ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, కంకణభట్టార్ శ్రీ ఎం.శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.Comments