సంక్షేమానికి, నమ్మకానికి నిదర్శనం జగనన్న.. మంత్రి తానేటి వనిత

 


కొవ్వూరు రూరల్  (ప్రజా అమరావతి);


సంక్షేమానికి, నమ్మకానికి నిదర్శనం జగనన్న.. మంత్రి తానేటి వనితకొవ్వూరు మండలం రూరల్ గ్రామాల్లో మంత్రి సుడిగాలి పర్యటన


10 గ్రామాల్లో వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ 


వైఎస్సార్ ఆసరా రెండో విడత ద్వారా కొవ్వూరు మండలం లో ఈరోజు పది   గ్రామాల్లోని 935 ఎస్.హెచ్.జి. గ్రూపు ల్లోని మహిళలకు రూ.7 కోట్ల 17 లక్షలు నగదు వారి ఖాతాల్లోకి జమ చేశామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఇచ్చిన మాటకి కట్టుబడే నాయకుడు జగనన్న మాత్రమే అన్నారు. 


శనివారం  ఐ. పంగిడి, ధర్మవరం, కాపవరం, దొమ్మేరు, వాడపల్లి, సీతంపేట గ్రామాలలో 10 గ్రామాలకు చెందిన డ్వాక్రా సంఘాలకు  వైఎస్సార్ ఆసరా రెండో విడత  చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, మీ బాధల్లో, మీ కష్టాల్లో, మీకు తోడుగా   అడుగడుగునా మీ వెంట ఉంటానన్న  నేత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న ప్రభుత్వం మహిళల సంక్షేమ ప్రభుత్వం అన్నారు. మీరు ఆనందంగా, మీ కుటుంబాలు సంతోషంగా ఉండడమే జగనన్న లక్ష్యం అన్నారు. అందుకోసం ఎన్ని పధకలైన అమలుకు వెనకడుగు వెయ్యకుండా ఇచ్చిన, ఇవ్వని హామీలు అమలు చేయడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం 2014 ఎన్నికల్లో రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వొచ్చి మిమ్మల్ని మోసం చేశారు. బ్యాంకు వాళ్ళని మీ ఇంటికి పంపి అవమానించారని గుర్తు చేశారు. జగనన్న అలా కాదు 11.4.2019 ఎన్నికల తేదీకి మీకు ఉన్న అప్పు 4 వాయిదా ల్లో చెల్లిస్తాను అని చెప్పాడు.. చేస్తున్నాడు అని తానేటి వనిత తెలిపారు. కన్నతల్లిలా... అంతకు మించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన కోసం, మన పిల్లలు శ్రేయస్సు కోసం కరోనా పరిస్థితుల్లో కూడా నిరాఘాటంగా అమలు చేస్తున్న చరిత్ర దేశంలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే అని తెలిపారు. కరోనా సాకు చూపి హామీలను వాయిదా వేసే పరిస్థితి ఉన్నా, ఆ దిశగా ఆలోచన చెయ్యకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వొచ్చారు. అమ్మఒడి ద్వారా బాల కార్మికులు లేని సమాజం కోసం మేనమమలా ప్రతి అడుగులో మనవెంట ఉంటున్నారు. ప్రజలందరికీ స్వంత ఇంటి కలసాకారం ఆలోచన చేస్తుంటే దానిని అడుగడునా అడ్డుకుంటున్నారు. ఐ. పంగిడి గ్రామంలో  152 గ్రూపులకు  ₹.120 .91 లక్షలు;  ధర్మవరం లో 83 గ్రూపులకు ₹.59.17 లక్షలు ;  కాపవరం లో 62 గ్రూపులకు ₹.62.70 లక్షలు;  దొమ్మేరులో  దొమ్మేరు172 గ్రూపులకు ₹.134.15 లక్షలు; పెనకనమెట్ట 74 గ్రూపులకు ₹.53.34 లక్షలు ;   వాడపల్లి లో వాడపల్లి కి 144 గ్రూపులకు ₹.105.28 లక్షలు, తోగుమ్మి కి చెందిన 65 గ్రూపులకు ₹ .52.07 లక్షలు ;  సీతంపేట గ్రామంలో సీతంపేటలోని 49 గ్రూపులకు ₹.36.82 లక్షలు, మద్దూరు కి చెందిన 104 గ్రూపులకు ₹.81.30 లక్షలు,  మద్దూరులంక కి చెందిన 30 గ్రూపులకు ₹.20.68 లక్షలు మేర  వైఎస్సార్ ఆసరా సొమ్ము వారి సంఘం ద్వారా వ్యక్తిగత ఖాతాలకు జమ చేసామన్నారు.


తొలుత జ్యోతిప్రజ్వలన చేసి, వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి డ్వాక్రా మహిళలు జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.కొవ్వూరు ఎంపిపి  కాకర్ల నారాయుడు, జడ్పిటిసి బొంతా వెంకట లక్ష్మి, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ పోసిన శ్రీలేఖ,  సర్పంచ్ లు జీ. నాగార్జున, ఎన్. నాగమణి, యూ.బాబ్జి, బి.రత్నకుమారి, ఎమ్.శ్రీనివాస్, ఎస్.పద్మిని, టి. కుమారి, జి. ప్రసాద్, జీ. బంగారయ్య,  ఎంపీటీసీ లు   కొనాల భవాని, జె. రోహిణి కోమలి, వైవి సత్యనారాయణ, ఐ. మౌనిక  , కె.సత్యనారాయణ, డి. ఆనంతలక్ష్మి, పి.తాతారావు,  ఏ. నాగరాజు, ఏఎంసి చైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాసరావు,  డీఎల్ డిఓ/ ఎంపీడీఓ పి. జగదాంబ, తాహసీల్దార్ బి. నాగరాజు నాయక్ ,  ఏరియా కో ఆర్డినేటర్  మధు, అధికారులు, పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీ  లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, డ్వాక్రా మహిళలు,  తదితరులు పాల్గొన్నారు.