మహిళల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత

 

నెల్లూరు, అక్టోబర్ 12 (ప్రజా అమరావతి): మహిళల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత


ఇస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రాపూరు ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఆసరా రెండో విడత సంబరాల  కార్యక్రమంలో  వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి కలెక్టర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకొని ఆర్థికంగా పరిపుష్టి సాధించాలన్నారు. ఎమ్మెల్యే శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాపూరు లో ఎప్పుడు వర్షం పడదని, అలాంటిది ఈ కార్యక్రమం ప్రారంభం కాగానే వర్షం పడడం శుభసూచకమన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పొదుపు గ్రూపు మహిళలకు రుణాలను మాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. నాలుగు విడతల్లో రుణమాఫీ నగదును ప్రభుత్వం జమ చేయనుందని, ఈ క్రమంలో మొదటి విడత వైయస్సార్ ఆసరా రుణమాఫీ నగదును గత ఏడాది జమ చేయగా, ప్రస్తుతం రెండో విడత ఆసరా నగదును అక్క చెల్లెమ్మ ల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు వివరించారు. మహిళల అభివృద్ధి, సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం అగ్రతాంబూలం వేస్తుందని, ఈ సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. పొదుపు మహిళలు అందరూ  జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అనంతరంవైయస్సార్ ఆసరా రెండో విడత నగదును 757 పొదుపు సంఘాలకు సంబంధించి 4.96 కోట్ల రూపాయల మెగా బ్యాంకు చెక్కును పొదుపు మహిళలకు అందించారు. 

 ముందుగా జగనన్న స్వచ్ఛ సంకల్పం పథకం ప్రారంభం సందర్భంగా చెత్త సేకరణ వాహనాలను కలెక్టర్, ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీమతి రోజ్ మాండ్, డిఆర్డిఎ పిడి శ్రీ సాంబశివారెడ్డి, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, ఎంపీడీవో శ్రీ ఆమోష్ బాబు, ఎంపీపీ శ్రీ చెన్ను బాలకృష్ణారెడ్డి, ఏపీఎం శ్రీ కృష్ణయ్య తదితర అధికారులు పాల్గొన్నారు. 

Comments