ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి చేదోడు

 


కొవ్వూరు (ప్రజా అమరావతి);ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి  ఆరుగురికి వైద్య ఖర్చుల కోసం రూ.7లక్షల 50 వేలు  అందించడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
 మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారుల కుటుంబ సభ్యులకు మంత్రి అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి చేదోడు


ఉంటూ, ఆపదలో అన్నలా సంక్షేమ పథకాలతో ఆదుకోవడానికి ఎప్పుడు ముందు ఉంటారని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని చాగల్లు, కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో ఆరుగురు  బాధితులకు వైద్య ఖర్చులు కోసం వెచ్చించి ఖర్చును రెయింబర్స్ మెంట్ కోసం   చేసుకున్న దరఖాస్తు లను  సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తాను సిఫార్సు చెయ్యడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.


సీఎం రిలీఫ్ ఫండ్ రూ.7.50 లక్షలు:


సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సత్యవాడా ఉదయ్ కార్తీక్ కి రూ.2 లక్షల 50 వేలు, వలవల నాగశివ కి రూ.3 లక్షల 75 వేలు, దుండి బోస్ రూ.37 వేలు, గంజిరాజు మునీశ్వర రావు రూ.27 వేలు, కెవివిఎస్ ఎస్ పవన్ కుమార్ రూ.20 వేలు, సంగం దుర్గా రూ.16 వేలు మొత్తాన్నీ మంత్రి బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి  చెక్కు రూపంలో అందచేయ్యడం జరిగింది. కార్యక్రమంలో ఎంపిపి కాకర్ల నారాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image