శరన్నవరాత్రులే దసరా పండుగ

 


విజయవాడ  ,అక్టోబర్ 12 (ప్రజా అమరావతి):


 *శరన్నవరాత్రులే  దసరా పండుగ* దసరా శరన్నవరాత్రులు రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవినవరాత్రులు పదవ రోజు విజయదశమితో కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాత మూడు రోజులు లక్ష్మీదేవికి ఆ తరువాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు చేస్తారు.

సామాన్యులే కాక యోగులు నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా

శాకేయులు దీనిని ఆచరిస్తారు . బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనావాయితీ ఆలయాలలో ఒక్కోక్కరోజు ఒకొక్క ఆలంకారం చేస్తారు.. ఈ రోజుల్లో

అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు.. లోకకళ్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించి, దుష్ట శిక్షణ శిక్ష రక్ష చేసి లోకాన్ని కాపాడారు. దసరా ఉత్సవాల్లో మంగళవారం నాటికి ఆరు రోజుల పూజలు ముగుస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు మొదటి రోజున శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గా దేవిగా, రెండవ రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా, మూడవ రోజున శ్రీ గాయత్రిదేవిగా, వాల్గవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా, అందవ రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మీ దేవిగా, ఆరోవ రోజు మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఏడవ రో జైన దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గాదేవిగా, ఏనిమిదోవ రోజైన మహర్నవమి రోజున

శ్రీ మాహిషాసురమర్ధినిదేవిగా,

తొమ్మిదవ రోజైన విజయదశమినాడు

శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతార రూపాలతో దర్శనమిస్తారు. ఇలా ఈ నవరాత్రులు సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెపుతున్నాయి. నవరాత్రుల్లో బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కెలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తున్నారు.

శ్రీ శివకామసుందరీదేవి అమ్మవారికి (ఉపాలయం) వారికి కూడా పై తెలిపిన రీతిలో అలంకారాలు నిర్వహిస్తున్నారు..
Comments