రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఖైదీలు

 నెల్లూరు (ప్రజా అమరావతి);

   రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఖైదీలు


సత్ప్రవర్తనతో సమాజంలో జీవించాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నెల్లూరు శివారు బుజబుజ నెల్లూరు సమీపంలోని కేంద్ర కారాగారంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  జాతిపిత గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి కలెక్టర్ నివాళులర్పించారు. అనంతరం జరిగిన  కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు జైళ్లలో ఖైదీలను అమానవీయంగా చూసేవారిని, ప్రస్తుతం ఖైదీలకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.  ఈ కారాగారంలోనే ఖైదీలు చదువుకునేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 50 పడకల వైద్యశాల, నాణ్యమైన ఆహారం, చేతివృత్తుల పై శిక్షణ, ఉచితంగా న్యాయ సహాయం తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రతి ఒక్క ఖైదీ కూడా ఆ జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన అహింసా మార్గంలో పయనించి  మెరుగైన సమాజం కోసం పాటుపడాలని సూచించారు. కన్నుకు  కన్ను అనే సిద్ధాంతాన్ని పాటిస్తే దేశమే అంధకారం అవుతుందని, అలా కాకుండా సత్యం, అహింస మార్గంలో జీవిస్తూ పదిమందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ శ్రీ రాజేశ్వరరావు కారాగారంలో ఖైదీల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం పలు పోటీల్లో విజేతలైన ఖైదీలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీమతి వెంకటరత్నం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ ఎం శ్రీనివాసులు నాయక్, కేంద్ర కారాగారం డిప్యూటీ సూపరింటెండెంట్లు శ్రీ కాంతరాజ్, శ్రీ ఎం మహేష్ బాబు తదితర అధికారులు పాల్గొన