రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై అధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

 


అమరావతి (ప్రజా అమరావతి):

– రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై అధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష


– క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష. 

– రాష్ట్రంలోని వివిధ థర్మల్‌కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై అధికారులతో సీఎం భేటీ. 

– థర్మల్‌ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 

– దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్న సీఎం. 

– కావాల్సిన బొగ్గు కొనుగోలుచేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టంచేసిన సీఎం. 

– ఇప్పుడున్న ధర్మల్‌కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలన్న ముఖ్యమంత్రి. 

– కృష్ణపట్నం, వీటీపీఎస్‌ల్లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశం.

– సింగరేణి సంస్థతో కూడా సమన్వయంచేసుకుని అవసరాలమేరకు బొగ్గును తెప్పించుకోవాలన్న సీఎం. 

– కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్న సీఎం. 

– కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం.

Comments