జిల్లా ఇంచార్జి DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రావు మంత్రి ఆళ్ల నానిని మర్యాద పూర్వకంగా కలిసి

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు. (ప్రజా అమరావతి);


జిల్లాలో సంక్షేమం, స్వావలంబన, సాధికారిత ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయం, సహాయక సంఘాల్లోని పేద మహిళల పురోగతికి ధోహదపడే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు..


ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు క్యాంపు ఆఫీస్ లో ఆదివారం జిల్లా ఇంచార్జి DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రావు మంత్రి ఆళ్ల నానిని మర్యాద పూర్వకంగా కలిసి


పుష్ప గుచ్చం అందసేసారు..


ఈ సందర్బంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాలు మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు...


మహిళలు జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావడానికి వారి కుటుంబంలో సుస్థిరమైన ఆదాయం వచ్చే విధంగా, జీవనోపాధి అవకాశాలు మరింత మెరుగు పడేలా ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి ఆళ్ల నాని కోరారు...


మహిళా పక్షపాత ప్రభుత్వంగా మహిళలు ఆర్ధిక, సామజిక, రాజకీయ చైతన్యానికి అన్ని విధాలుగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఆళ్ల నాని అన్నారు...


కరోనా కష్ట కాలంలో కూడ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో అక్కా చేల్లెమ్మలు జీవితాల్లో నిజమైన కాంతులు నింపాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు నిధులు కేటాయించారని మంత్రి ఆళ్ల నాని చేప్పారు...


మహిళల కోసం అమ్మఒడి, గోరుముద్ద, విద్యా దీవెన వసతి దీవెన, విద్యా కానుక, ఆడ పిల్లలకు అండగా ప్రభుత్వం అన్ని విధాలుగా పధకాలు అమలు చేస్తుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు...


Comments