ఏడు ఎంపిటిసి స్థానాలకు దాఖలైన 33 నామినేషన్లు.. ఎస్. మల్లిబాబుకొవ్వూరు  (ప్రజా అమరావతి); 


ఏడు ఎంపిటిసి స్థానాలకు దాఖలైన 33 నామినేషన్లు.. ఎస్. మల్లిబాబు కొవ్వూరు డివిజన్ పరిధి లో 6 మండలాలకు చెందిన 7 ఎంపీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు  శుక్రవారంతో   నామినేషన్లు స్వీకరించడం పూర్తయిందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు.ఏడు ఎంపిటిసి స్థానాలకు 33 నామినేషన్ లు దాఖలైనట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. 


కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన ఏడు ఎంపిటిసి స్థానాలకు గాను  అత్తిలి మండలంలో ఈడూరు కి (ఒకరు) ;  పాలూరు  కి (ఆరు) , చాగల్లు మండలంలో చాగల్లు-5 లో (ఇద్దరు) ;  ఇరగవరం మండలంలో కె. కుముదవల్లి లో (ముగ్గురు); , పెరవలి మండలంలో కానూరు-2 లో (ఐదుగురు), నిడదవోలు మండలంలో తాళ్లపాలెం లో (ఎనిమిది), తాళ్లపూడి మండలంలో వేగేశ్వరపురం-2 స్థానానికి (ఎనిమిది) నామినేషన్ లు వెయ్యడం జరిగిందన్నారు.నామినేషన్లు నవంబర్ 6న  పరిశీలిన చేసి, అనంతరం 7వ తేదీ అభ్యంతరాలపై  పరిశీలన, 8వ తేదీన అర్హత సాధించిన నామినేషన్ల జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. 9వ తేదీ 3 గంటల వరకు  నామినేషన్లు ఉపసంహరణ కి అవకాశం ఉండడంతో, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ను  గురువారం సా.3 తర్వాత ప్రకటిస్తారన్నారు. 16వ తేదీ ఉదయం 7 నుండి సా.5 వరకు పోలింగ్, రిపోలింగ్ కి  17 వతేది ను రిజర్వుడ్ డే గా ఉంచామన్నారు. నవంబర్ 18వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు.


.