జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో రూ.43.94 లక్షలు మేర లబ్ధిదారులు వన్ టైమ్ సెట్టిల్మెంట్ కింద చెల్లింపులుకొవ్వూరు  (ప్రజా అమరావతి);


జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో రూ.43.94 లక్షలు మేర లబ్ధిదారులు వన్ టైమ్ సెట్టిల్మెంట్ కింద చెల్లింపులు


చేసినట్లు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.


సోమవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో ఓటీఏస్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు 

పధకం ద్వారా ప్రజల కు మేలు చేసేందుకు ఓ టి ఎస్ పధకాన్నీ ప్రారంభించారన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు (₹.15.36 లక్షలు)  , చాగల్లు (₹.6.91 లక్షలు), తాళ్లపూడి (₹.9.72 లక్షలు) మండలాల్లో, కొవ్వూరు మునిసిపాలిటీ పరిధిలో(₹.11.95 లక్షలు) లబ్ధిదారులు మొత్తం రూ.43,94,308 లను చెల్లించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గతంలో లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ లని చేసే వారుకాదన్నారు.  గ్రామస్థాయిలో 10,000 రూపాయలు,  మున్సిపల్ స్థాయిలో 15,000 రూపాయలు ,మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో 20,000 రూపాయలు చెల్లించి నట్లైతే వారికి క్లియర్ టైటిల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం వన్ టైం సెటిల్మెంట్ లో తీసుకున్న రుణం అసలు తో పాటు వడ్డీని కూడా రద్దు చేయడం, రిజిస్ట్రేషన్ పత్రాలు జారిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు .


ఈకార్యక్రమంలో హౌసింగ్ డీఈఈ ఎన్. జె.రత్నాకర్, ఏ ఈ ఏవిఎన్ సత్య ప్రసాద్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.