ఎన్.డి.ఆర్.ఎఫ్ ప్రమాణాలకు అనుగుణంగా మండల వారీగా సిద్దం చేయాలన్నారు.

నెల్లూరు (ప్రజా అమరావతి);

జిల్లాలో  భారీ వర్షాలు, వరదలు కారణంగా  జరిగిన నష్టాలపై  నివేదికలను ఎన్.డి.ఆర్.ఎఫ్  ప్రమాణాలకు అనుగుణంగా  మండలాల వారీగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని  జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు.


సోమవారం  ఉదయం  కలెక్టరేట్ లోని శంకరన్ హాల్ లో  జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు,  జిల్లా అధికారులతో సమావేశమై  కేంద్రానికి  సమర్పించాల్సిన   నివేదిక  సమగ్రంగా  ప్రతి నష్టాన్ని  సవివరంగా తెలుపుతూ  ఎన్.డి.ఆర్.ఎఫ్  ప్రమాణాలకు అనుగుణంగా మండల వారీగా సిద్దం చేయాలన్నారు.


అల్పపీడనం కారణంగా  జిల్లాలో భారీ  వర్షాలు పడుతున్న  నేపధ్యంలో జిల్లా  అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన ముందస్తు  సహాయక చర్యలు చేపట్టడంతో పాటు ముంపు ప్రాంతాల్లో   క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలా చర్యలు  తీసుకోవాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు.  ప్రస్తుతం  వరద ప్రభావానికి గురైన గ్రామాల్లో చేపడుతున్న  సహాయ పునరావాస చర్యలను వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  నష్ట పోయిన ప్రతి రైతుకు  ప్రభుత్య పరిహారం కచ్చితంగా అందేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.  నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీ తో  అంధిస్తున్న  విత్తనాల పంపిణీపై రోజువారీ నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు,  వ్యవసాయ శాఖ జె.డి ని ఆదేశించారు.


 ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేందిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీ విధేహ్ ఖరే, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు,   డి.పి.ఓ  శ్రీమతి ధనలక్ష్మి,  ఇరిగేషన్ , పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ , ఆర్.డబ్ల్యు. ఎస్., ఆర్ అండ్ బి, హౌసింగ్, ఉద్యానశాఖ, మత్స్య శాఖ,   వైద్య ఆరోగ్య శాఖ , విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments