విచారణ కమిటీ ముందు హాజరైన వారు ఎవరు ఎటువంటి ఆధారాలు చూపించలేదని
కొవ్వూరు / పెనుగొండ (ప్రజా అమరావతి); కుమారి గెడ్డం స్రవంతి మృతిపై   విచారణ చేపట్టడం జరిగిందని, విచారణ కమిటీ ముందు హాజరైన వారు ఎవరు ఎటువంటి ఆధారాలు చూపించలేదని


, కేవలం అనుమానాలు, ఆరోపణలు మాత్రమే చెయ్యడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు.


శుక్రవారం మార్టేరు మార్టేరు ఎస్.సి.సంక్షేమ వసతి గృహం లో  విచారణ నిర్వహించారు. 


 పెనుమంట్ర మండలం, మార్టేరు గ్రామంలో 

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ నందు 8వ తరగతి చదువుతున్న  గెడ్డం సురేష్ వారి కుమార్తె   కుమారి గెడ్డం స్రవంతి  అక్టోబరు 28 వ తేదీన  అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగినదని,  ఈ విషయమై జిల్లా కలెక్టర్ - పశ్చిమగోదావరి జిల్లా వారు విచారణాధికారిగా నియమించి నందున ఈరోజు విచారణ నిమిత్తం హాజరైనట్లు మల్లిబాబు తెలిపారు.  విచారణ కమిటీ ముందు హాజరైన వారు ఎవరు ఎటువంటి ఆధారాలు చూపించలేదని, కేవలం అనుమానాలు, ఆరోపణలు మాత్రమే చెయ్యడం జరిగిందన్నారు.  విచారణ లో భాగంగా పాఠశాల  విద్యార్థులను, తోటి హాస్టల్ విద్యార్థులను, హాస్టల్ సిబ్బందిని, తొలిసారిగా చూసిన వారిని విచారణ చెయ్యడం జరిగిందన్నారు. ఈ సంఘటనకు సంబంధించి తుది పోస్టుమార్టం నివేదిక రానందున, ఆ నివేదిక వొచ్చిన తర్వాత తమ విచారణ తెలుసుకున్న అంశాలు ,పోస్టుమార్టం అంశాలు జోడించి ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించడం జరుగుతుందని ఆర్డీవో పేర్కొన్నారు.


ఈ విచారణ కు తహసిల్దార్ వై. దుర్గా కిషోర్, పెనుగొండ సి ఐ వివివి నాగేశ్వరరావు, పెనుమంట్ర ఎస్ ఐ  ఎస్ ఎన్ వివి రమేష్, ఏఎస్ డబ్ల్యూ ఓ, సంఘ ప్రతినిధులు, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.