రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తి స్థాయిలో ఆదు కుంటుంది *రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తి స్థాయిలో ఆదు కుంటుంది
 *ఈ-క్రాపింగ్  చేసి పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకుంటాం*


 *పంట నష్టం జరిగిన రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వడంతోపాటు ఇతరత్రా ప్రోత్సాహ కాల అందించి ఆదుకుంటాం* 


 *అన్ని చెరువులు పూర్తి సామర్థ్యంతో నిండి ఉన్నాయి.* 


 *మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కల్వర్టులను వర్షం తగ్గిన వెంటనే బాగు చేస్తాం*


 *పుంగనూరు పట్ట ణం లో ఉన్న అన్ని బ్రిడ్జి లను ఆధునీ కరణ చేస్తాo* 


 *రాబోయే రోజుల్లో పుంగనూరు పై ఎటువంటి వరద ప్రభావం లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపడతాం* 


     *:గౌ.రాష్ట్ర పంచా యతీ రాజ్  గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి వర్యులు* 


 పుంగనూరు, నవంబర్ 23 (ప్రజా అమరావతి):


భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను

రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదు కుంటుం దని గౌ.రాష్ట్ర పంచా యతీ రాజ్  గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి  పేర్కొన్నారు...


మంగళవారం మంత్రి వర్యులు  జిల్లా పర్య టనలో భాగంగా పుంగ నూరు అర్బన్ మరియు రూరల్ లో విస్తృతంగా పర్యటించి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టం,ఆస్తి నష్టం తీరు ను పరిశీలిం చారు..


ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ

రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం జరిగిన ప్రతి రైతు ను పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని,ప్రతి సెంటు భూమి  ఈ-క్రా పింగ్  చేసి పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకునేందుకుచర్యలు తీసుకుంటామని తెలి పారు...పంట నష్టం జరిగిన రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వ డంతోపాటు ఇతరత్రా ప్రోత్సాహకాల అందిం చి ఆదుకుంటా మన్నా రు.. మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కల్వర్టులను వర్షం తగ్గిన వెంటనే  బాగు చేస్తామని,పుంగ నూరు పట్టణం లో ఉన్న అన్ని బ్రిడ్జి లను ఆధునీకరణ చేస్తామని ,రాబోయే రోజుల్లో పుంగనూరు పై ఎటువంటి వరద ప్రభా వం లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపడతామన్నారు...


పుంగనూరు లో తొలుత కొత్తపేట  సర్కిల్ వద్ద గల కౌoడ న్య నదీ ప్రవాహాన్ని పరిశీలించి.. పుంగనూరు- మదన పల్లి రోడ్డు మీదుగా రాయల్ చెరువు మొరవ కారణంగా దెబ్బతిన్న ఇండ్లను బాధిత కుటుంబాలను పరామర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం రాయల్ చెరువు కట్టమీద నీటి సామర్థ్యాన్ని పరిశీలించి బీడీ వర్కర్స్ కాలనీ మరియు దోబీ కాలనీ లలో పర్యటించి దోబీ కాలనీ మరియు  సన్నా వుల్లా కాంపౌండ్ నందు  ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు నిత్యా వసర సరుకు లను పంపిణీ చేశారు... 


గౌ.మంత్రి వర్యుల పర్యటనలో చిత్తూరు ఎం పి ఎన్. రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్, ఎన్ ఆర్ ఈ జి ఎస్ స్టేట్ కౌన్సిల్  సభ్యులు ఎం. విశ్వ నాధ్,పలమనేరు,కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్. వెంకట్ రెడ్డి యాదవ్,రాష్ట్ర జానపద కళల అభి వృద్ధి సంస్థ చైర్మన్ కొండవీటి నాగ భూషణం,మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి,  పంచాయతీ రాజ్ చీప్ ఇంజనీర్ డి.సుబ్బా రెడ్డి, పంచాయతీ రాజ్, ఆర్ & బి, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ ఈ లు.అమర్ నాధ్ రెడ్డి,దేవానందం,విజ య్ కుమార్, హౌసింగ్ పీడీ  పద్మనాభం, డ్వామా పీడీ చంద్ర శేఖర్,డి పి ఓ దశరధ రామి రెడ్డి, జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, పుంగనూరు మునిసిపల్ చైర్మన్ ఆలీమ్ భాష, మునిసిపల్ కమిషనర్ కె .ఎల్. వర్మ, తహ సీల్దార్ వెంకట రాయు లు, జడ్పి టిసి సోమ శేఖర్ రెడ్డి, ఎంపీపీ భాస్కర్ రెడ్డి సంబం ధింత శాఖ ల డి ఈ లు, మండల స్థాయి అధికా రులు ప్రజా ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు..