పార్టీలకతీతంగా ప్రజాశ్రేయస్సే ధ్యేయం" - కాకాణి.

 *"పార్టీలకతీతంగా ప్రజాశ్రేయస్సే ధ్యేయం" - కాకాణి.*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరు మండలం, నరుకూరు సెంటర్ లో సి.పి.యం.పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు గారితో కలిసి సిఐటియు భవనము మరియు ఆటో స్టాండ్ ను ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు జక్కా వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకతీతంగా ప్రజలందరీ సంక్షేమం కోసం పనిచేస్తున్నారు.


 నరుకూరు సెంటర్లో పెద్దాయన జక్కా వెంకయ్య గారి పేరిట నిర్మించిన భవనాన్ని  ప్రారంభించడం సంతోషంగా ఉంది.


 నెల్లూరు జిల్లాకే వన్నెతెచ్చిన మహనీయులుగా కీర్తిశేషులు పుచ్చలపల్లి సుందరయ్య గారు, జక్కా వెంకయ్య గారు కీర్తి గడించారు.


 జక్కా వెంకయ్య గారు నీతి, నిజాయితీ, నిబద్ధతలకు మారుపేరుగా నిలిచారు.


నెల్లూరు జిల్లాలో రైతాంగ శ్రేయస్సుకోసం, పేదల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చే వెంకన్న లేకపోవడం తీరని లోటు.


 ఆంధ్ర రాష్ట్ర సి.పి.యం. ప్రధాన కార్యదర్శి స్థాయికి మన నెల్లూరీయుడు మధు అన్న ఎదగడం మనందరికీ గర్వకారణం.


 ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అందరితో కలిసి ప్రతి ఒక్కరిని కలుపుకొని పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం.