పదవ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ స్టడీ మెటీరియల్ పంపిణీ

గుంటూరు(ప్రజా అమరావతి);       గుంటూరు రూరల్ అడవి తక్కెళ్ళపాడు నందు గల గురుకుల బాలయోగి సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహము నందు పదవ తరగతి విద్యార్థులకు కొలిశెట్టి అనిల్ కుమార్ (గుంటూరు) అండ్ ఫ్రెండ్స్ సహాయ సహకారం తో హెల్ప్ పౌండేషన్( సత్తనపల్లి) ఆధ్వర్యంలో మ్యాథ్స్ స్టడీ మెటీరియల్ పంపిణీచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ శాంతి విశాల అధ్యక్షత వహించారు కార్యక్రమానికి ముందుగా జ్యోతిరావు పూలే 130 వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హిస్టరీ అకాడమీ డైరెక్టర్ మరియు దిశా పౌండేషన్ వ్యవస్థాపకురాలు జిక్కి రెడ్డి సుబ్బాయమ్మ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పరచుకొని, నీ పక్కన ఎవరూ లేక పోయినా, నీ చదివే నిన్ను అందరూ గర్వపడేలా చేస్తుందని చదువును మించిన ఆస్తి లేదని తెలిపారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ప్రగతి నారీ మహిళ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు పోట్లూరి దేవి ఈ సందర్భంగా మాట్లాడుతూ మీరు నేర్చుకునే విద్య విలువలతో కూడిన ది అయితే భవిష్యత్తులో ఆ విలువ లే మీ భవిష్యత్తుకు పునాదులు అని తెలిపారు కొలిశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణతో దేనినైనా సాధించవచ్చని తెలిపారు. 80 మంది విద్యార్థులకు కు మెటీరియల్ అందించారు ఈ కార్యక్రమంలో లో  హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల బుల్లిబాబు ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు