శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఒడిశాకు సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

 


అమరావతి (ప్రజా అమరావతి);


రేపు (09.11.2021, మంగళవారం) శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఒడిశాకు సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ 


శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం.


అనంతరం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నవీన్‌ పట్నాయక్‌తో రెండు రాష్ట్రాలకు సంబంధించి వివిధ పెండింగ్‌ అంశాలపై చర్చలు.


చర్చల అనంతరం రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ రేపు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వెళ్ళనున్నారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 01.15 గంటలకు పాతపట్నం చేరుకుని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.


శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్‌ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్‌ పట్నాయక్‌ నివాసంలో రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్‌ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకోనున్నారు.