పేద కుటుంబాలకు కాకాణి చేయూత

 *" పేద కుటుంబాలకు కాకాణి చేయూత


"*


 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు గ్రామంలో విఘ్నేశ్వర పురం, శ్రామిక నగర్, లింగంపల్లి తోపులో పర్యటించి, ప్రజలతో మమేకమైన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


శ్రామిక నగర్ యస్.టి.కాలనీ లో యానాదుల కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.*


లింగంపల్లి తోపులో కూలిపనులకు వెళ్లలేని పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తక్షణమే స్పందించడంతో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.


 జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే నిర్వహించి, అన్ని ప్రాంతాలను పరిశీలించి, అధికారులతో సమీక్షించి, సత్వర చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశించారు.


 చంద్రబాబు నాయుడు భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న కుటుంబాలకు మనోధైర్యం కల్పించడం పోయి, ప్రభుత్వంపై విమర్శలు చేసే రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.


 చంద్రబాబు నాయుడు రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప, మరేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు.


 తెలుగుదేశం హయాంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా వర్షాలు, వరదల సమయంలో ప్రజల దగ్గరకు వెళ్ళాలంటే భయపడే వాళ్ళం.


 సర్వేపల్లి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్లు నిర్మించడంతో పాటు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్లగలుగుతున్నాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలో 30 నెలల పదవీకాలంలో రెవిన్యూ పరమైన సమస్యలు తప్ప,

మిగిలిన వాటినన్నింటిని దాదాపుగా పరిష్కరించగలిగాం.


 ప్రజలలో తిరుగుతుంటే వాళ్ళు చూపే ఆదరణ, అభిమానం అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది.


 మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించాం కాబట్టే, ప్రజలలో మాకు ఆదరణ ఉంది.


 సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు నా శాయశక్తుల కృషి చేస్తా.