*ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉద్ధేశించిన కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
*–సమావేశానికి హాజరైన కీలక శాఖలకు చెందిన విభాగాధిపతులు, అధికారులు*
*–విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్ గ్రిడ్, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు,* *పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వైయస్సార్ స్టీల్‌ప్లాంట్ తదితర* *కార్యక్రమాలను, అంశాలను సమీక్షించిన సీఎం.*
అమరావతి (ప్రజా అమరావతి);
*విద్యాకానుకపై సీఎం సమీక్ష*
2021–22 విద్యాకానుక కోసం 790 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా
విద్యాకానుక కింద పిల్లలకు నోట్ పుస్తకాలు, షూలు, డిక్షనరీ, స్కూలు బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్ ఇస్తున్న ప్రభుత్వం.
జగనన్న గోరు ముద్దకోసం 2021–22లో రూ.1625 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
మనబడి నాడు –నేడు మొదటి విడతకు ఇప్పటివరకూ రూ.3650 కోట్లు ఖర్చు
రెండో విడత కింద 12663 స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమం
దీనికోసం దాదాపు రూ.4,535 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
విద్యారంగంలో నాడు – నేడు అన్నది అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమమని స్పష్టంచేసిన సీఎం
ఇది సమర్థవంతంగా ముందుకు సాగాలన్న సీఎం
– నైపుణ్యాభివృద్ధి కాలేజీలపైనా సీఎం సమీక్ష
వెంటనే పనులు మొదలుపెట్టాలని సీఎం ఆదేశం
– వాటర్ గ్రిడ్ పనులపైనా సీఎం సమీక్ష
ఉద్దానం, పులివెందుల, డోన్లలో కొనసాగుతున్న వాటర్ గ్రిడ్ పనులపైనా సీఎం సమీక్ష
ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న సీఎం
*–రోడ్లపైనా సీఎం సమీక్ష*
మే చివరి నాటికి రోడ్ల నిర్మాణం పూర్తవుతుందని తెలిపిన అధికారులు
ఇప్పటికే పలుచోట్ల పనులు ప్రారంభం అయ్యాయని వెల్లడించిన అధికారులు
వీటిపై మరింత ధ్యాస పెట్టాలన్న సీఎం
– అమరావతి ప్రాంతానికి వెళ్లే కరకట్ట రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు
– పనులు వేగంగా ముందుకు సాగేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
– దీనివల్ల అమరావతి వెళ్లడానికి మంచి రోడ్డు సౌకర్యం ఏర్పాటవుతుందన్న సీఎం
– రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల ఏర్పాటుపైనా సీఎం సమీక్ష
– దాదాపు రూ.30వేల కోట్లకుపైగా మౌలికసదుపాయల కోసం ఖర్చు.
– రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల నిర్మాణంపైనా సీఎం సమీక్ష
– పోర్టులతోపాటు షిషింగ్ హార్బర్ల నిర్మాణాలు వేగంగా సాగేలా చూడాలన్న సీఎం.
ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్ చంద్ర, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణద్వివేది, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శులు ఎన్ గుల్జార్, కె వి వి సత్యనారాయణ, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధరరెడ్డి, ఏపీ టిడ్కో ఎండీ సిహెచ్ శ్రీధర్, ఏఎంఆర్డీఏ కమిషనర్ కె విజయ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.