గిరిజనులకు అవగాహన సదస్సులు .


SEB కార్యాలయం

విజయవాడ (ప్రజా అమరావతి);


 ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా 30-10-2021 నుండి 05-11-2021 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.అందులో భాగంగా బస్టాండ్లు , రైల్వేస్టేషన్లలో విస్తృత తనిఖీలు నిర్వహించడంతో పాటు నిఘాను పటిష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో నిరంతర నిఘాను ఏర్పాటు చేసి సోదాలు నిర్వహించి  సెబ్ నామోదు చేసిన కేసుల వివరాలు:*


మొత్తం నామోదు చేసిన కేసులు : 283 

మొత్తం అరెస్టు అయిన నిందితులు : 763

మొత్తం స్వాధీనం చేసుకున్న గంజాయి: 9,266

మొత్తం స్వాధీనం చేసుకున్న వాహనాలు : 179  

గంజాయి కట్టడికి పోలీసు ఉన్నతాధికారుల ద్వారా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పొరుగు రాష్ట్రాల సహకారం తీసుకుంటోంది ..


*గిరిజనులకు అవగాహన సదస్సులు .*. 

అమాయక గిరిజనులకు డబ్బు ఆశ చూపించి స్మగ్లర్లు గంజాయి సాగు చేస్తున్నారు . ఈ క్రమంలో ముందు స్మగ్లర్లకు ' సహకరించే గిరిజనుల్లో అవగాహన , కౌన్సిలింగ్  ఆపరేషన్ పరివర్తనలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు . పాడేరు , జి.మాడుగుల , నర్సీపట్నం , చింతపల్లి , జీకే వీధి మండలాలతో పాటు తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ గ్రామాలైన కొత్తూరు , నులకమద్ది , కచ్చూరు , గుర్తేడు , సోకులగూడెం ప్రాంతాల్లో విస్తృత సదస్సులు నిర్వహించారు . గిరిజనులు , విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి గంజాయి సాగు , దుష్పరిణామాలపై నిపుణులు , పోలీసు అధికారులతో వివరించారు . గంజాయి వలన ఏ విధంగా నష్టాలు ఉంటాయనే దానితో పాటు సాగు , రవాణాలో పాల్గొంటే చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు . గిరిజనులు ఇకపై ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడబోమంటూ ప్రతిజ్ఞ తీసుకున్నారు.