సిపిఎం నాయకుల అక్రమ అరెస్టును ఖండించిన సిపిఎం జిల్లా కమిటీ.

 

తాడేపల్లి (ప్రజా అమరావతి);


సిపిఎం నాయకుల అక్రమ అరెస్టును ఖండించిన సిపిఎం జిల్లా కమిటీ.


సిపిఎం మంగళగిరి రూరల్ మండల కార్యదర్శి ఎం. జ్యోతిబసు, నాయకులు ఫకీరయ్య, వారి కుటుంబ సభ్యులను, స్థానిక సిపిఎం నాయకులు ప్రసాద్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని  జిల్లా కార్యదర్శి పాశం రామారావు  తెలిపారు.

 అరెస్టైన నాయకులను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో పరామర్శించారు.ఈ సందర్భంగా పాశం రామారావు మాట్లాడుతూ ఆత్మకూరులో ప్రభుత్వ భూమిని ఆక్రమించారు అంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. 2004లోనే 4 సెంట్లు గ్రామకంఠం భూమిని ఫకీరయ్య  కుటుంబం కొనుగోలు చేసిందని, అప్పటి నుండి వారి తల్లిదండ్రుల పేరుతో చలివేంద్రం నడుపుతూ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు నడుపుతున్నారు.  అధికార పార్టీ అనుయాయులు సిపిఎం అభివృద్ధిని సహించలేక అధికారులపై ఒత్తిడి తెచ్చి షెడ్డును కూల్చడం, నాయకులను అరెస్టు చేయడం సరికాదని,  భూమి ప్రభుత్వానిది అయితే న్యాయస్థానంలో నిరూపణ అయ్యాక చర్యలు తీసుకోవాలని, అలాకాకుండా ఏకపక్షంగా వ్యవహరించి అరెస్టు చేయడం అక్రమ అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.