ఒన్ టైం సెటిల్‌మెంట్" లబ్ధిదారుల వివరాలు డేటా నమోదు

 


కొవ్వూరు (ప్రజా అమరావతి)!
జ‌గ‌న‌న్న‌ శాశ్వ‌త గృహ‌, భూహ‌క్కు ప‌థ‌కం "ఒన్ టైం సెటిల్‌మెంట్"  లబ్ధిదారుల వివరాలు డేటా నమోదు


లో పంచాయతీ కార్యదర్సులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం పంచాయతి కార్యదర్సులతో , గ్రామ రెవెన్యూ అధికారులు తో సమావేశం నిర్వహించారు.  ఓటిఎస్ లబ్ధిదారుల వివరాలు హౌసింగ్ శాఖ , నిర్ణిత డాక్యుమెంట్ వివరాలు తో అందించడం జరిగిందన్నారు. 

డేటా నమోదుకు సంబంధించిన గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పూర్తి చేయాలని సూచించారు.  వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చెయ్యాలని  డివిజన్ పరిధిలో  లబ్ధిదారుల డేటా సేకరించి వాలంటీర్లు అందచేసే ఉన్నారన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గృహ‌నిర్మాణ సంస్థ నుంచి1983 - 2011 సంవ‌త్స‌రాల మ‌ధ్య గృహ‌నిర్మాణానికి రుణాన్ని తీసుకొన్న వ్య‌క్తుల కోసం రూపొందించిన ఒన్ టైం సెటిల్‌మెంట్ ప‌థ‌క‌మే జ‌గ‌న‌న్న శాశ్వ‌త గృహ భూహ‌క్కు ప‌థ‌కం పై సందేహం నివృత్తి చేసే అంశాలపై ఎంపీడీఓ లకు, సిబ్బందికి అవగాహనని కలుగ చేశామని ఆర్డీవో మల్లిబాబు అన్నారు.  ఈ ప‌థ‌కాల కింద ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం లబ్దిదారుని వాటాగా ల‌బ్దిదారుల‌కు రుణాల‌ను మంజూరు చేసిందని, రుణాన్ని గ‌డువులోగా చెల్లించ‌లేని ల‌బ్దిదారుల‌కు ఆయా రుణాల‌ను మాఫీ చేసే నిమిత్తం రాష్ట్ర ప్ర‌భుత్వం ఒన్ టైం సెటిల్ మెంట్ ప‌థ‌కాన్ని అమ‌లు చేయడానికి డేటా నమోదు చేయాలని  నిర్ణ‌యించిందన్నారు.  డివిజన్ పరిధిలోని 13 మండలాల్లో 78,364 మంది లబ్దిదారుల్లో 38,220 (55 శాతం ) మంది డేటా  అప్ లోడ్ చెయ్యడం జరిగిందన్నారు. ఇంకా 31,222 మంది వివరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే అప్లోడ్ చేసి ఉన్న డేటా ప్రకారం లబ్దిదారుల్ని గుర్తింపు, వారి వివరాలకు సంబంధించిన సమగ్ర డేటా నమోదు తక్షణమే పూర్తి చెయ్యాల్సి ఉందన్నారు.   హౌసింగ్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి డేటా నమోదు లో సాంకేతిక పరమైన అంశాలపై అనుమానాలు నివృత్తి చెయ్యాల్సి ఉందని మల్లిబాబు పేర్కొన్నారు.
జల్లో ఉన్న అపోహలను తొలగించి , ఈ పధకం యొక్క ప్రయోజనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి అవగాహన కలుగచేసే గురుతరమైన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ ప‌థ‌కం వినియోగించుకోడానికి అర్హ‌త‌ ఉందో లేదో వాలంటీర్ తెలుపుతారని, ఒన్ టైం సెటిల్‌మెంట్ కింద ల‌బ్దిదారుల‌కు అవ‌కాశం క‌ల్పించే స్వ‌చ్ఛంద ప‌థ‌కం అన్నారు. ల‌బ్దిదారుడు మ‌ర‌ణించిన  త‌ర్వాత అత‌ని కుటుంబ‌ వారసులు లీగ‌ల్ హ‌య‌ర్ స‌ర్టిఫికెట్‌, ఫ్యామిలీ మెంబ‌రు స‌ర్టిఫికెట్ వంటి అధీకృత‌ ధ్రువ‌ప‌త్రాలు స‌మ‌ర్పించ‌డం ద్వారా ఈ ప‌థ‌కము ప్రయోజనం పొందవచ్చు నన్నారు. 


ఈ సమావేశంలో హౌసింగ్ ఈ ఈ సి హెచ్ బాబురావు, డీఈ  ఎన్ జె రత్నం, తహసీల్దార్ నాగరాజు, తదితరులు హాజరయ్యారు.