ముఖ్యమంత్రి గారికి ప్రజల్లో పెరుగుతున్న జనఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షం కుట్రలు పన్నుతున్నారు...

 పశ్చిమగోదావరి జిల్లా...ఆకివీడు (ప్రజా అమరావతి);ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా ఆకివీడు ఎన్నికలు పార్టీ కార్యాలయంలో వైస్సార్సీపీ నాయకులతో సమావేశమైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...


పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ్ రాజు, ఉంగుటూరు MLA పుప్పాల వాసుబాబు బీమవరం MLA గ్రంధి శ్రీనివాస్, నరసాపురం MLA ముదినూరి ప్రసాద్ రాజు,గోపాలపురం MLA తలారి వేంకట్రావు, ఎంబీసీ చైర్మన్ వీరన్న,జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, మాజీ చైర్మన్ మేక శేషుబాబు, డీసీసీబీ చైర్మన్ నరసింహారాజు,,పాతపాటి సర్రాజు, గోకరాజు రామరాజు, యోగేంద్ర బాబు,గుబ్బల తమ్మయ్య...


మొదటి సారిగా ఆకివీడు నగర పంచాయతీకి జరుగుతున్న ఎన్నికల్లో వైస్సార్సీపీ జండా ఎగురు వేయడానికి పార్టీ శ్రేణులు అందరూ సైనికులా పని చేయాలని సూచించిన మంత్రి ఆళ్ల నాని...


రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి వెళ్లిఎన్నికలు ప్రచారంలో ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేసిన మంత్రి ఆళ్ల నాని...


ముఖ్యమంత్రి గారికి ప్రజల్లో పెరుగుతున్న జనఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షం కుట్రలు పన్నుతున్నారు...రాష్ట్రములో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ఏదో రకంగా ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి...


ఆకివీడు ప్రజలు విజ్ఞనులు... జగనన్న ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పధకాలు అందుతున్నాయి...


ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలు ప్రజలకు వివరించి ఓట్లు అడిగే హక్కు వైస్సార్సీపీకే ఉంది...


రాష్ట్రములో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైస్సార్సీపీ ఘన విజయం సాధించింది...


ఎన్నికలు ఎప్పుడు జరిగిన ప్రజలు వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు...


రాష్ట్రములో పేద, మధ్య తరగతి ప్రజలు పక్షాన నిలబడిన నాయకుడు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి గారు...


కరోనా సమయంలో కూడ చేప్పిన పధకాన్ని ప్రతి పేద కుటుంబానికి అందించిన దేశంలో ఏకైక నాయకుడు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి గారు...


అసత్య అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు గుణపాఠం చేప్పడానికి సిద్ధంగా ఉన్నారు...


సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన ఆదరణ చూడలేక ప్రతిపక్షల్లో అసూయ పెరిగిపోతుంది...పరిపాలన మరింత సులువు చేసి ప్రజల వద్దకే పరిపాలన అందిస్తూ గ్రామ, వార్డు సచివాలయం ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలనను అందించడం జరుగుతుందని చెప్పారు..నెలలో జరగబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుగానే క్యాలెండర్ రూపంలో ప్రజల ముంగిట్లోకి తీసుకువచ్చిన ఘనత కేవలం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని పేర్కోన్నారు..మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు..


పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తోందని చెప్పారు..


ఆకివీడు ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు..పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఒకరికొకరు భాగస్వామ్యమై తొలిసారి జరుగుతున్న ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి జెండా రెపరెపలాడడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించరు..ఆకివీడులో వైస్సార్సీపీ శ్రేణులు సమన్వయముతో పని చేసి వైస్సార్సీపీకి అఖండ విజయం చేకూర్చాలని ఆకివీడు నాయకులకు విజ్ఞప్తి..

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image