తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి*తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి**వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు*


కర్నూలు, నవంబర్ 20 (ప్రజా అమరావతి):-తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో అధికారులు  అప్రమత్తంగా ఉండాలని, ఆర్ డి ఓలు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలను జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు ఆదేశించారు.*


శనివారం తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల నేపథ్యంలో  జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు సంబంధిత మండలాల  అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ.... తుంగభద్ర డ్యాం నుంచి 40 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారని, లక్ష వరకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వి ఆర్ ఓ లతో లోతట్టు ప్రాంతాలలో టాంటాం (దండోరా) వేయించాలన్నారు.  నదిలో ప్రవాహం తగ్గేవరకు  నదీ సమీప ప్రాంతాలకు పిల్లలు, గొర్రెలు, పశువులు, మేకలు కాపరులు వెళ్లకుండా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓలను  జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది కనుక స్నానానికి మాల ధరించిన భక్తులు నదిలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ప్రజలకు తాగు నీటి సమస్య లేకుండా చూడాలన్నారు..ప్రజలను తరలించాల్సి వస్తే ముందుగానే స్కూల్స్ ను సిద్ధం చేసుకోవాలన్నారు.. 

ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు..

నదీ పరివాహక ప్రాంతాలు.. తహశీల్దార్ లు, ఎంపిడిఓలు, ఈవో పి ఆర్ డీలు,పంచాయతీ  సెక్రటరీ లు హెడ్ క్వార్టర్స్ లో ఉండాలన్నారు..రెవెన్యూ, ట్రాన్స్ కో, పోలీస్  శాఖల అధికారులు అలెర్ట్ గా ఉండాలన్నారు.. కోసిగి, కౌతాలం, పెద్ద కడబూరు,సి. బెళగల్ ,మంత్రాలయం, గూడూరు, కొత్తపల్లె, కర్నూలు అర్బన్ మరియు రూరల్ మండలాల తహసీల్దార్ లు, ఎంపిడిఓలతో మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.


కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో డిఆర్ఓ పుల్లయ్య, డిపిఓ ప్రభాకర్ రావు, విపత్తుల నిర్వహణ డిపిఎం, తదితరులు పాల్గొన్నారు.*


కర్నూలు ఆర్ డి ఓ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) తమీమ్ అన్సారీయా, కర్నూల్ ఆర్ డి ఓ హరిప్రసాద్ పాల్గొన్నారు.