ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగులో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరిచామన్న



*నవంబర్‌ 14న తిరుపతిలో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సన్నాహక సమావేశం*

*–కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశం.*


*–కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం*

*–ఏపీ సహా ఈ సమావేశంలో పాల్గోనున్న కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు.*

*–అండమాన్‌నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్, లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ కూడా హాజరు.*


అమరావతి (ప్రజా అమరావతి);

–సదరన్‌ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశం.

– దీనివల్ల సమావేశంలో చర్చ జరిగి మేలు జరిగే అవకాశం ఉంటుందన్న సీఎం.


– ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగులో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరిచామన్న


అధికారులు.

– తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ. 6300 కోట్ల విద్యుత్‌బకాయిలు, రెవిన్యూలోటు, రేషన్‌ బియ్యంలో హేతుబద్ధతలేని రీతిలో కేంద్రం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్లైస్‌ బకాయిల అంశాలపై చర్చించాలని సమావేశంలో నిర్ణయం. 


– ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని నిర్ణయం.

– ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సదరన్‌జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించాలని సన్నాహక సమావేశంలో నిర్ణయం.

– కేఆర్‌ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయం.

– నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనలమీదా  సమావేశంలో చర్చ.

దీనిపై రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలపై వివరాలు తయారుచేయాలన్న సీఎం.

– వీటికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు సిద్ధంకావాలి : సీఎం

– కౌన్సిల్‌ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే.. వాటిపై కూడా తగిన రీతిలో సిద్ధంగా ఉండాలి : అధికారులకు శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం.


ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎక్స్‌ అఫిషియో ప్రిన్సిపల్‌ సెక్రటరీ (స్టేట్‌ రీఆర్గనైజేషన్‌) ఎల్‌ ప్రేమచంద్రారెడ్డి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి విజయ్‌ కుమార్, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, అదనపు డీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) ఎ రవిశంకర్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.