శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీసుబ్రమణ్యస్వామి వారి హోమం ప్రారంభం

 

 శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీసుబ్రమణ్యస్వామి వారి హోమం ప్రారంభం


     

 తిరుపతి (ప్రజా అమరావతి):

      తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం కనిపిస్తుంది. 

 కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు ఉండే విష‌యం విదిత‌మే.


 ఇందులో భాగంగా యాగశాలలో....

 ఉదయం పూజ, 

 హోమం,

 లఘుపూర్ణాహుతి,

 నివేదన,

 హారతి నిర్వహించారు. 


 సాయంత్రం హోమం,

 సహస్రనామార్చన,

 విశేష దీపారాధన నిర్వహించనున్నారు.


 కాగా మంగ‌ళవారం కూడా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం జరుగనుంది. 


 మంగ‌ళ వారం సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు.


ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్‌, ఆలయ అర్చకులు, అధికారులు.