కుండపోత వర్షాల ప్రభావానికి గురైన అన్నదాతలకు అండగా నిలబడాలని సీఎం ఆదేశించారు..


అమరావతి (ప్రజా అమరావతి);


*వర్షాల కారణంగా వాటిల్లిన పంట నష్టాల  నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష..*


శనివారం 13 జిల్లాల వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ ఉన్నతాదికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష 


సీఎం జగన్ ఆదేశాల మేరకు పంట నష్టం అంచనాలు తక్షణమే సిద్ధం చెయ్యాలని అధికారులకు మంత్రి ఆదేశం..


అత్యధికంగా ఈస్ట్, వెస్ట్ , కడప జిలాల్లో వరి పంట నష్టం ఎక్కువ జరిగిందని మంత్రికి వివరించిన అధికారులు..


కడప జిల్లాలో రబి శనగ పంట నెల్లూరు జిల్లాలో వరి నారుమడులు దెబ్బతిన్నాయని వివరించిన అధికారులు 



కుండపోత వర్షాల ప్రభావానికి గురైన అన్నదాతలకు అండగా నిలబడాలని సీఎం ఆదేశించారు..


ముంపుకు గురైన ప్రాంతాల్లో రైతులకు సహాయంగా ఉండేలా  చర్యలు తీసుకోవాలని  సీఎం ఆదేశించారు..


ముంపునకు గురైన ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు, అధికారులు పర్యటించాలి..


ముంపునకు గురైన పంట పొలాలు, తోటలను పరిశీలించి నష్ట తీవ్రతను తగ్గించేలా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి. 


తుఫాన్ ప్రభావం 

ఎక్కువగా వున్న జిల్లాల్లో సీనియర్ వ్యవసాయ శాఖా అధికారులు పర్యటించాలి..


ఎక్కువగా దెబ్బతిన్న జిల్లాల్లో పంట నష్ట అంచనాలు , రైతులకు సహాయంగా ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారుల నియామకం 


ఈస్ట్ గోదావరి ( హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ ) వెస్ట్ గోదావరి ( జెడి శ్రీధర్) , కడప జిల్లాకు సీడ్స్ ఎండి శేఖర్ బాబులకు 

బాధ్యతలు 


ఆయా జిల్లాలు , రాష్ట్ర స్థాయి అధికారులతో సమన్వయము చేసుకోవాలి  .


వ్యవసాయ సలహా మండళ్ల సభ్యులు కూడా గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా నిలవాలి..


వర్షాల వల్ల దెబ్బతిన్న పంటని అంచనా వెయ్యడం తో పాటు మిగిలిన పంటను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి..


వ్యవసాయ సలహా మండళ్లు తమ పరిధిలో దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులకు అండగా ఉండాలి..


కడప జిల్లాలో నష్టపోయిన బెంగలగ్రామ్ రైతుల్ని  గుర్తించి వారికి 80 శాతం సబ్సిడీ తో విత్తనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి..


ఈ క్రాఫ్ ద్వారా దెబ్బతిన్న రైతులు గుర్తించి సహాయం అందేలా చూడాలి..


ధాన్యం కొనుగోలు విషయంలో FAQ నిబంధనలు సరలించేలా చర్యలు తీసుకోవాలి..


ఈస్ట్ వెస్ట్ కృష్ణా ఇరిగేషన్ అధికారితో కలిసి కాలువలు డ్రైన్ లు క్లియర్ చెయ్యాలి..


ఆర్బీకే లను ప్రామాణికం తీసుకుని రేపటి నుండి పంట నష్టం అంచనా వేయాలి..


ఆర్‌బీకే స్థాయి వరకు వ్యవసాయ, ఉద్యాన సిబ్బంది క్షేత్ర స్థాయిలో రైతులకు 24 గంటలూ అందు బాటులో ఉండాలి .


ముంపునకు గురైన వర్షపునీరు సాధ్యమైనంత త్వరగా కాలువల ద్వారా పోయేందుకు చర్యలు తీసుకోవాలని జేడిలకు ఆదేశాలు.. 


జలవనరుల శాఖ ఎస్‌ఈలతో చర్చించి కాలువల్లో వర్షపు నీరుపోయేటట్టు చూడాలని  ఆదేశాలు..


ముంపునీరు దిగి పోగానే ఎన్యుమరేషన్‌ బృందాలను రంగంలోకి దింపి ఏ ఒక్క రైతు నష్టపోకుండా పూర్తి పారదర్శకంగా తుది అంచనాలు రూపొందించాలి..


ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య

వ్యవసాయ కమిషనర్ హెచ్‌.అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.