ఘనంగా ముగిసిన గ్రంధాలయ వారోత్సవాలు

 


కొవ్వూరు (ప్రజా అమరావతి);* ఘనంగా ముగిసిన గ్రంధాలయ వారోత్సవాలు* వారం రోజులుగా నిర్వహించిన పోటీల్లో విజేతలు 72 మంది


*  విద్యార్థులకు బహుమతుల ప్రధానం...గ్రంధాలయాల ఆధునిక దేవాలయాలని, ప్రతి ఒక్కరూ గ్రంధాలయాలకు వొచ్చి వ్యక్తిత్వ వికాసం, మానసిక ఉల్లాసం పొందగలుగుతారని మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్న కుమారి పేర్కొన్నారు.


శనివారం ఉదయం 54వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా కొవ్వూరు ప్రధమ శ్రేణి జిల్లా శాఖా గ్రంధాలయంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిధిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రత్న కుమారి మాట్లాడుతూ, గత వారం రోజులు గా గ్రంధాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు జాతీయ స్వాతంత్ర్య అంశాలపై, దేశ సుస్థిరత జాతీయ సమైక్యత నాయకుల పై పోటీల్లో పాల్గొని విద్యార్థులు తమ ప్రతిభను చాటారన్నారు.  జాతీయ నాయకుల పై, స్వాతంత్ర్య ఉద్యమం పై విద్యార్థుల్లోని స్మృజనాత్మకత తనని ఎంతో ముగ్దురాల్ని చేసిందన్నారు. తెలియని ఎన్నో విషయాలు మనకు గ్రంధాలయాల్లో పుస్తకాలు రూపంలో అందుబాటులో ఉంటాయన్నారు. గతంలో చందమామ, బొమ్మరిల్లు పుస్తకాలు ద్వారా నీతి కథలు అందుబాటులో ఉండేవన్నారు. వాటివల్ల వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందేవన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం గ్రంధాలయాల్లోని పుస్తకాలు ద్వారా తెలుసుకోవొచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, భవిష్యత్తు తరాలకు వారధులుగా చరిత్రను అందించాల్సిన భాద్యత నేటి యువత పై ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగివున్న విద్య, విజ్ఞానాన్ని పదును పెట్టాల్సిన  ఆవశ్యకత ను గుర్తించాలని కోరారు. జాతి సమైక్యత, సమగ్రతను చాటుకునేందుకు, తెలుసుకునేందుకు గ్రంధాలయాలను మూల స్తంభాలని వారు తెలిపారు.


గ్రంధాలయ వారోత్సవాల్లో వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో 600 మందికి పైగా విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను చాటారని లైబ్రరీయన్ త్రినాథ్ పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న వారిలో 72 మందికి బహుమతులు అందచేస్తున్నామన్నారు.  పోటీల్లో పాల్గొనడమే ప్రతి ఒక్క  విద్యార్థి గెలుపుగా పేర్కొంటూ పిల్లల్ని అభినందించారు. జూనియర్ విభాగంలో క్విజ్ పోటీల్లో 12 , పాటల విభాగంలో 3, వ్యాసరచన - 3, వకృత్వ విభాగంలో 3, చిత్రలేఖనం లో 7 గురుకి చొప్పున, సీనియర్ విభాగంలో 


క్విజ్ పోటీల్లో 12 , పాటల విభాగంలో 3, వ్యాసరచన - 3, వకృత్వ విభాగంలో 3, చిత్రలేఖనం 3, రంగోలి లో 3 చొప్పున, ఇంటర్ విభాగంలో పాటల విభాగంలో 3, వ్యాసరచన - 3, వకృత్వ విభాగంలో 3, చిత్రలేఖనం 3, రంగోలి లో 4 గురుకి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు మన్నే పద్మ, గండ్రోతు అంజలి దేవి, కౌన్సిలర్ సభ్యులు తోట లక్ష్మి ప్రసన్న, అక్షయపాత్ర శ్రీని వాస్ రవీంద్ర ,మున్సిపల్ స్కూ ల్ టీచర్ విజయలక్ష్మి, లైబ్రేరి యన్ జి. వి. వి. ఎన్.త్రినా ధ్,పెద్దలు సోమరాజు తది తరులు పాల్గొన్నారు.