ఇబ్రహీంపట్నం (ప్రజా అమరావతి); మత్య సంపదను పెంపోందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతేకశ్రద్ద తీసుకుంటున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు తెలిపారు.
మత్యశాఖ వారి ఆధ్వర్యంలో శనివారం నాడు ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రి, తమ్మలపాలెం వద్ద గల కృష్ణానదిలో చేపల ఉత్పత్తిని పెంపొందించడం కోసం మత్య శాఖ వారు ఏర్పాటు చేసిన చేప పిల్లలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు , స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి శనివారం నాడు కృష్ణానది లో వదిలారు.
షుమారు 10 లక్షల చేప పిల్లలను ఒకేసారి కృష్ణానది లో విడుదల
చేశారు.పెద్ద మెత్తం లో చేప పిల్లలను కృష్ణానదిలో వదిలి మత్య సంపదను పెంపోందించడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు కోనియాడారు.
ఈ కార్యక్రమం లో మత్య శాఖ జెడి లాల్ మహ్మద్ ,ఎ డి చక్రాణి , రాష్ట్ర డైరెక్టర్ లంకే దేవకుమారి , యంపిపి పాలడుగు జోత్న దుర్గా ప్రసాదు , జడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి రాంబాబు , మునిసిపల్ కౌన్సిలర్ లు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
కృష్ణానది లో చేప పిల్లలు వదిలే పక్రియ సందర్బంగా మత్య కారుల కుటుంబాలకు చెందిన యువత ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారికి ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీగా కృష్ణా నది వద్దకు తోడ్కోని వెళ్ళారు.
addComments
Post a Comment