విశాఖలో 96 కోట్లతో క్రూయిజ్‌ బెర్త్‌

 

*విశాఖలో 96 కోట్లతో క్రూయిజ్‌ బెర్త్‌*

రాజ్యసభలో శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 9 (ప్రజా అమరావతి): సాగరమాల పథకం కింద విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లోని ఔటర్‌ హార్బర్‌లో క్రూయిజ్‌ టెర్మినల్‌ బెర్త్‌, టెర్మినల్‌ భవనం నిర్మాణం కోసం పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ 96 కోట్లు కేటాయించగా క్రూయిజ్‌ కమ్‌ కోస్టల్‌ కార్గో టెర్మినల్‌ నిర్మాణం కోసం పర్యాటక శాఖ 38 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌ రెడ్డి గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ పర్యాటక రంగాన్ని ప్రభావితం చేసే అంశాల్లో క్రూయిజ్‌ టూరిజం (నౌకా పర్యాటం) ఒకటని తమ మంత్రిత్వ శాఖ గుర్తించినట్లు చెప్పారు. సముద్రం, నదుల్లో నౌకా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపారు.

స్వదేశ్‌ దర్శన్‌లో కోస్టల్‌ టూరిజం సర్క్యూట్‌ అభివృద్ధిని చేర్చి వాటికి అవసరమైన వసతుల అభివృద్ధి కోసం ఆయా రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి శ్రీ కిషన్‌ రెడ్డి తెలిపారు. పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ జాతీయ కార్యక్రమంగా చేపట్టిన సాగరమాల పథం ద్వారా దేశంలోని 7,500 కి.మీ పొడవైన తీర ప్రాంతాల అభివృద్ధి ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ముమ్మరం చేయడంతోపాటు పర్యాటక రంగానికి కూడా ఈ ప్రాజెక్ట్‌ కింద కొత్త ఊపు వస్తుందని చెప్పారు. స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ వద్ద హోప్‌ ఐలాండ్‌, కోరింగ వన్యమృగ సంరక్షణ కేంద్రం, పాసర్లపూడి, ఆదూరు, ఎస్‌.యానాం, కోటిపల్లి ప్రాంతాలలో పర్యాటక రంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం 67 కోట్లు, నెల్లూరు జిల్లాలోని పులికాట్‌ సరస్సు, ఉబ్బలమడుగు జలపాతం, నేలపట్టు, కొత్తకోడూరు, మైపాడు, రామతీర్ధం, ఇస్కపల్లి వద్ద పర్యాటక వసతుల కల్పన కోసం 49 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి వివరించారు.

-----------------------------------------------

*వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరిగింది*

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 9: దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య 42.5 శాతం నుంచి 45.6 శాతానికి పెరిగినట్లు గురువారం రాజ్యసభలో కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్‌ తెలి వెల్లడించారు. శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ జూలై 2019 నుంచి జూన్‌ 2020 మధ్య నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) నిర్వహించిన కార్మిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్యలో పెరుగుదల కనిపించగా, అదే కాలంలో తయారీ రంగంలో కార్మికుల సంఖ్య 12.1 శాతం నుంచి 11.2 శాతానికి తగ్గినట్లు తెలిపారు. కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తితో వలస కార్మికులు పెద్ద ఎత్తున తమ స్వగ్రామాలకు తరలి పోవడం, లాక్‌డౌన్‌ వలన కర్మాగారాలు తాత్కాలికంగా మూతపడటం ఇందుకు కారణాలుగా మంత్రి పేర్కొన్నారు.


Popular posts
దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొడాలి నాని
Image
ముఖ్యమంత్రి హెూదాలో పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టిన వైఎస్సార్ ను ఎలా మర్చిపోగలం
Image
ప్రజల గుండెల్లో చురస్మరణీయమైన స్థానం పొందిన వ్యక్తి నారా లోకేష్
Image
ఎన్టీఆర్ అభిమానిగా సీఎం జగన్మోహనరెడ్డికి పాదాభివందనం చేస్తున్నా
Image
మెడల్ హౌస్.... - రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు - 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం - కరీంనగర్‌లో యువబిల్డర్ ప్రయోగం సక్సెస్ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు. ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది. నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్ది గా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది. ఖర్చు పెట్టారిలా: గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. చైనా, జర్మనీల్లో చూసి ప్లాన్‌చేశారు పేరాల కృష్ణారావు, ఎండీ, వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించారు. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. పేద ప్రజల కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి మోడల్ హౌస్ అని పేరుపెట్టారు
Image