నవరత్నాలు పధకాలలో దాదాపు 99 శాతం అమలు చేస్తున్నారు.

 

చిత్తూరు, డిసెంబర్ 12 (ప్రజా అమరావతి): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి సభ్యులుగా ఎంపికైన జడ్పీటిసి ఎంపిపిలు జిల్లా పరిషత్ ద్వారా పలు అభివృద్ది పనులు చేపట్టి జిల్లా అభివృద్దికి సహకరించాలని జడ్పీ ఛైర్మన్ వి.గోవిందప్ప శ్రీనివాసులు కోరారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో తొలి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సంధర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాలు పధకాలలో దాదాపు 99 శాతం అమలు చేస్తున్నారని


భారత దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం గర్వించదగ్గ పాలన అందిస్తున్నారని తెలిపారు. ప్రజలకు త్రాగు, సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ ద్వారా పలు అభివృద్ది పధకాలు చేపట్టారని నాడు – నేడు కార్యక్రమం కింద విద్యశాఖలో మొదటి దశ పనులు పూర్తి చేసి రెండవ దశ పనులు ప్రారంబించారని తెలిపారు. కరోనా రెండు విడతలు సమర్ధ వంతంగా ఎదుర్కొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలిగామన్నారు. 

ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది వ్యవస్థ ప్రజలతో మమేకమై సేవలు చేసే కీలకమైన వ్యవస్థ అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆద్వర్యంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖా మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పేద, బడుగు బలహీన వర్గాలకు అన్ని సంక్షేమ అభివృద్ది పధకాలను అందజేస్తున్నారని అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, తదితర పధకాలు లబ్ది చేకూరడంతో జిల్లాలో పేద వారి సంఖ్య తగ్గిందని ప్రజలందరూ సుఖంగా ఉన్నారని తెలిపారు. జడ్పీ టిసి లు సర్పంచులతో కలిసి ప్రజలతో మమేకమై వారి ప్రాంతాలలో ప్రజలకు ప్రభుత్వ పరoగా పధకాల లబ్ది చేకూర్చాలని జిల్లా అభివృద్దికి సహకరించాలని కోరారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది  శాఖా మాత్యులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడ్డాక స్వతంత్ర్యం వచ్చి మొట్ట మొదటి సారిగా ఒకే పార్టీ నుండి ఎన్నికైన జడ్పీటిసిలు, ఎం.పి.టిసిలతో జరుగుతున్న జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం ఇదేనన్నారు. గతంలో ఎప్పుడూ సభ్యులందరూ ఒకే పార్టీకి చెందిన వారు లేరని ఇది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సువర్ణాద్యాయo అన్నారు. ఇందులో భాగసౌమ్యులైన సభ్యులందరికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, డిజిటల్ ఆసిస్టంట్ లు, వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు లాంటి పలు పధకాలను చేపట్టి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు ఏ కులాన్ని విస్మరించకుండా కొన్ని కార్పొరేషన్ లైన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మొదలియార్ కార్పొరేషన్, జానపద కలల అభివృద్ది కార్పొరేషన్, తదితర కార్పొరేషన్ లకు ఛైర్మన్ లను నియమించారని తెలిపారు. రాష్ట్రం విడిపోయి అప్పులలో ఉన్న రాష్ట్రాన్ని తీసుకున్నా, రాష్ట్ర అభివృద్దికి, రాష్ట్రాన్ని అభివృద్ది పధంలో నడిపేందుకు అంకుట దీక్షతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, కరోనా భారీన పడి దాదాపు రెండు సంవత్సరాలు ఆర్ధిక వ్యవస్థ క్రుంగి పోయినా ఎన్నికల ముందు చెప్పిన హామీలను పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రులలో నాడు-నేడు కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివే విధ్యార్ధులకు నాణ్యమైన విధ్యనందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 330 కోట్లు కరువు ప్రాంతాలలో నీటి రవాణా కొరకు ఖర్చు చేస్తుంటే మన జిల్లాలోనే 160 కోట్ల నీటి రవాణా బకాయిలను చెల్లించామన్నారు. భారీ వర్షాలకు జిల్లాలో రోడ్లు, చెరువులు బాగా దెబ్బతిని వేల కోట్లతో పునరుద్దరణ పనులు  చేపట్ట వలసి ఉన్నాయని వీటి కొరకు జిల్లా యంత్రాంగం యుద్దప్రాతిపధికను ప్రతిపాధనలు పంపుతున్నారని తెలిపారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకో బడ్డ సభ్యులు మీ ప్రాంత అభివృద్దికి కార్యోన్ముఖులు కావాలని, ప్రజలకు అతి దగ్గరగా ఉండి సేవలు చేయాలని కోరారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా అభివృద్దికి మనమంతా కలిసి పనిచేద్దామన్నారు. ముఖ్యమంత్రి వర్యులు కడప తరువాత చిత్తూరు జిల్లాకు అధిక ప్రదాన్యత ఇస్తారని ప్రభుత్వం నుండి జిల్లా అభివృద్దికి కావలసిన నిధులు మంజూరు చేసుకుందామన్నారు. గ్రామీణాభివృద్ది శాఖలో సంక్రాంతి లోపు పెండింగ్ లో ఉన్న బకాయి బిల్లులను 70 శాతం మంజూరు చేస్తామన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం మీద మాట్లాడుతూ వన్ టైమ్ సెటెల్ మెంట్ కమిటీని ముఖ్యమంత్రి వర్యులు నియమించారని అందులో సభ్యులుగా తాను ఉన్నానని గతంలో గృహ నిర్మాణ శాఖ ద్వారా రుణాలు పొందిన వారు గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుతం రూ. 10 వేలు, మునిసిపాలిటీలలో రూ.15 వేలు, కార్పొరేషన్ రూ.20 వేల చొప్పున  చెల్లిస్తే వారి రుణాలు పూర్తిగా మాఫీ అయ్యి వారి ఇంటి మీద పూర్తి హక్కులు వస్తాయని, ఉచితంగా రిజిష్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం పేద వారి గృహాలకు రుణాలు ఇచ్చినా వారి గృహాలకు హక్కు కల్పించలేదని దాని వలన లబ్ది దారులు ఆ ఇంటిని ఎవరికి విక్రయించడానికి గాని, బ్యాంకులలో తాకట్టు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఉండేదని తెలిపారు. సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతిప్రతినిధులు గ్రామ స్థాయిలో లబ్దిదారులకు ఈ విషయం పై అవగాహన కల్పిస్తే ఈ కార్యక్రమాన్ని వంద శాతం అమలు చేయొచ్చని తెలిపారు. లబ్ది దారులను బలవంతం పెట్టకుండా ఈ పధకం పై అవగాహన కల్పించాలన్నారు. 

ఈ సమావేశంలో ఎం.ఎల్.సి ఎండపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ హెచ్ ఎన్.ఎస్.ఎస్ కింద గండి కోట – మొలకల చెరువు నుండి ప్రాజెక్ట్ చేపట్టారని, చిన్న గొట్టి గల్లు –ఎర్రావారి పాళ్యం మండలాలకు పైప్ లైన్ ద్వారా నీటిని అనుసందానిస్తే ఈ రెండు మండలాలను శాశ్వతంగా కరువు నుండి తప్పించ గలమని పీలేరు, రొంపిచెర్ల, ఎర్రావారి పాల్యం, రొంపిచెర్ల మండలాలకు నీటిని అనుసందానించాలని కోరారు. 

ఈ సమావేశంలో చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు హజరై మాట్లాడుతూ వర్షాల వలన జిల్లాలో రోడ్లు, పంటలు బాగా దెబ్బ తిన్నాయని ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రత్యక్షంగా చూసి కావల్సిన మేరకు నిదులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. జగనన్న సంపూర్ణ భూ హక్కు పధకం మీద ప్రజలకు అవగాహన కల్పించాలని లబ్ది దారులకు సంపూర్ణ గృహ హక్కు ద్వారా లబ్ది చేకూరుతుందని తెలిపారు.  

పలమనేరు ఎం.ఎల్.ఏ వెంకటగౌడ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థలో పంచాయతీల సెక్రెటరీల ద్వారా వారి గ్రామాలలో లబ్ది దారులను గుర్తించి జగనన్న సంపూర్ణ గృహ హక్కు మీద అవగాహన కల్పించాలని అప్పుడే ఈ పధకం పూర్తిగా విజయవంతం అవుతుందన్నారు. పంచాయతీ సెక్రెటరీలకు ఈ పధకం పై అవగాహన పెంచాలన్నారు. 

జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ ద్వారా మంజూరు అయిన గృహాలను కట్టుకోలేని లబ్ది దారులు ఉన్నట్లయితే వారి గృహాలను మరొక అర్హులకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వై.ఎస్.ఆర్ జగనన్న కాలనీలలో లబ్ది దారులకు గృహాలు మంజూరు చేయడం

లో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. 

ఈ సమావేశంలో అంశముల వారీగా వ్యవసాయ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, జలవనరుల శాఖ, రహదారులు మరియు భవనముల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, గృహ నిర్మాణ శాఖ, విధ్యుత్, విధ్యా శాఖల ప్రగతి మీద సంబందిత శాఖాదికారులు వివరించారు. వ్యవసాయ శాఖలో రైతు సాగు చేస్తున్న ప్రతి పంటను ఈ పంట యాప్ నందు నమోదు చేయించాలని, దీని ద్వారా  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ లబ్ది రైతులకు అందుతుందని వ్యవసాయ శాఖ జె.డి వివరించారు. ఖరీఫ్ లో 1.77 లక్షల హెక్టర్లు, రబీ లో 5,770 ఎకరాల హెక్టర్లు ఈ పంట నమోధు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ పంట రుణాల కింద ఖరీఫ్ లో రూ.5752 కోట్లకు గాను 5820 కోట్లు, వ్యవసాయేతర రుణాలు 2028 కోట్లకు గాను 1765 కోట్లు రైతులకు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 946 రైతు భరోసా కేంద్రాలు ప్రారంబించి ప్రతి కేంద్రంలో ఒక గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా విత్తనములు, ఎరువులు, క్రిమి సంహారక మందులు రైతులకు పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ ద్వారా 10171 పనులను 305.64 కోట్లతో చేపట్టి 319 పనులు 27.51 కోట్లతో పూర్తి చేశామని సూపరింటెండెంట్ ఇంజినీరు వివరించారు. మార్చి నాటికి ప్రతి ఇంటికి కొలయి ద్వారా నీరు ఇచ్చేందుకు జల జీవన్ మిషన్ పధకం కింద చర్యలు చేపట్టామన్నారు. వరదలలో 200 పదకాలు పనులు దెబ్బ తినగా అన్నింటిని మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చామన్నారు. ఇటీ వల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో అన్ని చెరువులు పూర్తిగా నిండాయని 10 నుండి 15 టిఎమ్ సి ల నీరు పారుతుందని జలవనరుల శాఖ ఎస్ ఈ తెలిపారు. జిల్లాలో 7650 చెరువులకు గాను 6250 చెరువులలో నీరు అధికంగా పారుతొందని దాదాపు 90 శాతం చెరువులలో నిండుగా నీరు ఉందన్నారు. 

ఇటీ వల కురిసిన వర్షాలకు ఆర్ అండ్ బి రోడ్లు దెబ్బ తిన్నదని కొన్ని చోట్ల రోడ్ల పునఃరుద్దరణ పనులు జరుగుతున్నాయని ఆర్.అండ్ బి ఎస్ ఈ వివరించారు. శ్రీకాళహస్తి మండలంలో నాయుడు పేట పూతలపట్టు రోడ్డు నుండి ఏర్పేడ్ వరకు కనక్టివిటీ చేయాలని డబుల్ రోడ్డు ప్రతిపాధనలు పంపాలని జడ్పీ టిసి తెలియజేశారు. బంగారుపాళ్యం మండలం గాజుల కండ్రిగ నుండి రోడ్లు పూర్తిగా దెబ్బ తిన్నదని మదనపల్లి టౌన్ నుండి సి టి ఎం వెళ్ళే టౌన్ దెబ్బ తిన్నదని పేట మిట్ట – బండ పల్లి మీదుగా పాకాల చేరుకుంటున్న దామల చెరువు మెయిన్ రోడ్డు వెంటనే మరమ్మత్తులు చేయాలని సత్యవేడు మండలం రాజు గుంట చెరువు నిండి పోవడంతో వూతుకోట నుండి ప్రజలు వస్తున్నారని, గతంలో కూడా ప్రాణ నష్టం జరిగిందని వీటిని పునఃరుద్దరణ చేయాలని సంబందిత జడ్పీ టిసి లు కోరారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా చేపట్టిన ప్రగతిని ఎస్ ఈ వివరిస్తూ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్. ఆరోగ్య కేంద్రాలు, బి.ఎం.సి యు లు, డిజిటల్ గ్రంధాలయాలు, రూరల్ రోడ్డు కనెక్ టివిటీ తదితర పనులు చేపట్టామని, ఇప్పటి వరకు 946 గ్రామ సచివాలయాలలో 281 పనులను పూర్తి చేసి ఇకను 645 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 921 రైతు భరోసా కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 39.52 కోట్లతో ఖర్చు చేశామని 200 పనులు పూర్తి కాగా 686 పనులు పురోగతి లో ఉన్నాయన్నారు. నవరత్నాలు పెదలందరికి ఇల్లులో భాగంగా వై.ఎస్.ఆర్ జగనన్న కాలనీలలో ఈ ఏడాది 1,85,339 గృహములను మంజూరు చేశామని ఇప్పటి వరకు 1,03,139 గృహాల నిర్మాణ పనులు చేపట్టి 43,193 గృహముల బేస్మెంట్ ఆ పై స్థాయిలో నిర్మించిన వాటికి 293.93 కోట్లు వ్యయం చేయడమైందని పి.డి హౌసింగ్ వివరించారు. 13 జిల్లాలలో చిత్తూరు జిల్లా గృహ నిర్మాణాల పనులలో మొదటి స్థానంలో ఉందని సిమెంట్, ఇటుకలు లబ్దిదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఇటీ వల కురిసిన భారీ వర్షాలకు పూర్తి గా దెబ్బ తిన్న గృహాలకు 321 నూతన గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద 4,71,227 లబ్ది దారులు ఉన్నారని వారికి ఓ.టి.ఎస్ పధకం పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. విధ్యుత్ శాఖ ప్రగతిని ఎస్.ఈ వివరిస్తూ 9 గంటలు పగటి పూట విధ్యుత్ సరఫరా చేస్తున్నామని, భారీ వర్షాల వలన నష్టం జరిగిన అన్ని గ్రామాలు మరియు మండలాలలో విధ్యుత్ లైన్ లను పునఃరుద్దరణ చేశామని తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పాల ఏకీరి సంఘం ఛైర్మన్ మురళీధర్, జాన పదకళల సంస్థ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ రామ చంద్రా రెడ్డి, రెస్కో ఛైర్మన్ సెందిల్ కుమార్, ఎపి ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఈశ్వరయ్య, మరియు వి.కోట సీనియర్ సభ్యులు గౌస్ ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.