వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో జగన్ రెడ్డి ప్రభుత్వం నయా దోపిడి

 


*వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో జగన్ రెడ్డి ప్రభుత్వం నయా దోపిడి


*


*కరోనా నుండి కోలుకుంటున్న ప్రజల జీవితాలపై పెనుభారం కానున్న వన్ టైం సెటిల్మెంట్*


*టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్లు*


*మంగళగిరి నియోజకవర్గంలో ఏ ఒక్క ఇల్లు, ఇళ్ల పట్టాలు ఇవ్వలేని ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఓ టి ఎస్ పేరుతో తమ ప్రభుత్వం దోచుకుంటున్న విధానంపై ప్రజలకు సమాధానం చెప్పాలి*


- మీడియా సమావేశం లో నియోజకవర్గ టీడీపీ నాయకులు గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరావు

మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎం ఎస్ ఎస్ భవన్లో, జగన్ రెడ్డి ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్మెంట్ పేరుతో పేద ప్రజలను దోపిడీ చేస్తున్న విధానంపై టిడిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు


*టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి మాట్లాడుతూ....*


ప్రజలపై మోయలేని భారం వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం 


మాట తప్పం, మడమ తిప్పం అంటూనే ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారు


 గత ప్రభుత్వాలు ఎన్టీఆర్ హయాం నుండి పేదలకు ఇచ్చిన స్థలాలకు , ఓటిఎస్ పేరుతో ప్రజలవద్ద భయభ్రాంతులకు గురి చేస్తూ 10వేలు, 20వేలు వసూలు చేస్తున్నారు 


వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఇళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం తన అసమర్థతను చాటింపుచేసుకుంటూ,ఇళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తామంటూ కొత్త నాటకానికి తెరలేపారు


 పాదయాత్ర లో జగన్ రెడ్డి పేదలకు ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తామని చెప్పిన మాట వాస్తవమో కాదో ప్రజలకు తెలియజేయాలి


జగన్ రెడ్డి అబద్ధపు ప్రచారాలతో తన పేపర్ చానల్ ద్వారా ప్రజల్ని పేదలను వంచిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారు


కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన పేదలు పదివేలు ఇరవైవేలు,ముప్పయివేలు ఎక్కడినుంచి తీసుకువస్తారో ప్రభుత్వం ఆలోచించాలి


రేపు టిడిపి ప్రభుత్వం వస్తే ఒక్క రూపాయి లేకుండా ఉచితంగా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాం


4,500 కోట్ల దోచుకోవడానికే ఈ వన్ టైమ్  సెటిల్మెంట్ 


పేద ప్రజల భుజస్కంధాలపై వైసీపీ ప్రభుత్వం భారం మోపడాన్ని  తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం


రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఇళ్లు టిడ్కో ద్వారా గత టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తే, వాటికి మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో ఉన్న చేతగాని అసమర్థ వైసీపీ ప్రభుత్వం నేడు గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇంటి పట్టాల కు రిజిస్ట్రేషన్ చేస్తామని కొత్త దోపిడీకి తెరలేపారు


పేద ప్రజలకు ఈ స్కీం పేరుతో ఎలాంటి ఇబ్బందులు తలపెట్టిన సహించేది లేదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం


ఓటీయస్  తక్షణమే రద్దు చేసి పేదవారికి ఉచితంగా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం


*గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరరావు మీడియాతో మాట్లాడుతూ ...*


 పనులు లేక, ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే జగన్ రెడ్డి ప్రభుత్వం ఓ టి ఎస్ పేరుతో దోపిడీకి పాల్పడుతోంది


పేదల ఇళ్ల స్థలాల పై జగన్ రెడ్డి మరోసారి  మాట తప్పి మడమ తిప్పి పేదలపై భారం మోపుతున్నారు


గత 40 సంవత్సరాల నుండి ఎందరో ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించి వారి హయాంలో పేదలకు ఇచ్చిన వీళ్లకు నేడు వైసీపీ ప్రభుత్వం 10వేలు, 20వేలు, 30వేలు కట్టమని  ప్రజపై భారం మోపడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం


30 నెలల వైసిపి పరిపాలన లో ఒక ఇల్లు కూడా నిర్మించని వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల స్థలాల పై రిజిస్ట్రేషన్ పేరుతో భారం మోపడం దారుణం


రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అధికారులతో  పెన్షన్లు ఆపుతాం, కేసులు పెడతామంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు


 రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు, వీరందరికీ టిడిపి అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పియున్నారు


నాబార్డ్ , హడ్కొ లాంటి సంస్థలు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నా,  ఈ ప్రభుత్వం  ప్రజలకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తుందో ప్రజలకు తెలియజేయాలి


వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది


ప్రభుత్వ ఆస్తులు తనఖా,అమ్మకాలు పెడుతూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇసుక, మద్యం, మైన్ మాఫియా లతో రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు 


వన్ టైమ్ సెటిల్మెంట్  పేరుతో ప్రజలను బెదిరిస్తే పోరాటం చేస్తాం


ఈ వన్‌టైమ్ సెటిల్మెంట్ ను తక్షణమే రద్దు చేసి పేదలకు ఉచితంగా ప్రజలకు రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒకవేళ ఇవ్వని పక్షంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే ప్రజలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని తెలియజేస్తున్నాం


మంగళగిరి నియోజకవర్గంలో ఏ ఒక్క ఇల్లు, ఇళ్ళ పట్టాలు ఇవ్వలేని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏవిధంగా ఓటీయస్  పేరుతో  పేదల డబ్బులు దోచుకోవడానికి తెరలేపారో ప్రజలకు సమాధానం చెప్పాలి *మంగళగిరి రూరల్ మండల అధ్యక్షులు తోట పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ...*


వన్‌టైమ్ సెటిల్మెంట్ ప్రజలపై మోయలేని భారం అలాంటి విపత్కర పరిస్థితి నుండి ఇప్పుడే కోలుకుంటున్న ప్రజానీకంపై దోపిడీకి తెరలేపిన జగన్ రెడ్డి


 మాట తప్పం మడమ తిప్పం అంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీలను మరిచి ప్రజలపై  ఓటీఎస్  పేరుతో దోచుకోవటం చాలా దుర్మార్గమైన చర్య


 రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విధానాలను మానుకోవాలి.