కోవిడ్ వ్యాక్సినేషన్ అందరికీ అందించాలనే దృఢ సంకల్పంనెల్లూరు (ప్రజా అమరావతి);


 కోవిడ్ వ్యాక్సినేషన్ అందరికీ అందించాలనే దృఢ సంకల్పం


తో జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు నేతృత్వంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం కృషి చేయడంతో రాష్ట్రంలోనే  మొదటి డోసు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన జిల్లాగా రాష్ట్రంలో నెల్లూరు ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మహత్కార్యానికి తమవంతు సహకారాన్ని త్రికరణశుద్ధిగా

అందించిన ప్రజలకు, ప్రజాప్రతినిదులకు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులకు, వైద్యులకు, ఆశావర్కర్లకు, ANM లకు,

గ్రామ/వార్డు కార్యదర్శులకు, వాలంటీర్లకు, సహకరించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది అందరికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.  ఇదే స్ఫూర్తితో సమష్టి కృషితో 2వ డోసు వాక్సినేషను కూడా 100 శాతం త్వరగా పూర్తిచేసి జిల్లాకు ఎనలేని ఖ్యాతిని, గుర్తింపును తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ముఖ్యంగా  ఒక నిర్దిష్ట లక్ష్యం మేరకు పనిచేయడంతో  సచివాలయాల పరిధిలో 100 శాతం వ్యాక్సిన్ అందించారు. జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) శ్రీ గణేష్ కుమార్ పర్యవేక్షణలో డిఎంహెచ్ఓ శ్రీమతి రాజ్యలక్ష్మి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు ఎప్పటికప్పుడు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లు చేపట్టి వైద్య  సిబ్బందికి తగిన సూచనలు అందిస్తూ వ్యాక్సినేషన్ మొదటి డోసు 100 శాతం సాధించడంతో రాష్ట్రంలోనే జిల్లాను ముందంజలో నిలిపేందుకు నిరంతరం కృషి చేశారు. మన రాష్ట్రంలో జనవరి 16, 2021 నుండి, 18 సంవత్సరములు నిండిన జనాభా అందరికి కరోనా నియంత్రణ వాక్సినేషను వేయు ప్రక్రియ మొదలైనప్పటి నుండి, జిల్లాలో వైద్యారోగ్యశాఖ సిబ్బంది చేసిన అవిరళ కృషి ఫలితంగా జిల్లాలో 18 సంవత్సరములు నిండిన 23,69,865 మందికి మొదటిడోసు

వాక్సినేషను అందజేసి, రాష్ట్రంలో ఈనెల 11వ తేదీ నాటికి మొదటి డోసు వాక్సినేషను 100 శాతము పూర్తి చేసిన మొట్ట మొదటి జిల్లాగా నెల్లూరు జిల్లా నిలిచింది. 

 

  జిల్లాలో  100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసిన 14 సచివాలయాల సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఇటీవల ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించి వారిని సత్కరించి అభినందించారు. దీంతో మిగిలిన సచివాలయాల సిబ్బంది కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకొని అంకితభావంతో పనిచేయడంతో 100 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ సాధ్యమైంది. తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్ కు డిఎంహెచ్వో శ్రీమతి రాజ్యలక్ష్మి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.