ఎన్ని ఇబ్బందులున్నా, రైతు పండించిన ప్రతి గింజా సేకరించి తీరుతాం

 *- ఎన్ని ఇబ్బందులున్నా, రైతు పండించిన ప్రతి గింజా సేకరించి తీరుతాం


*


*- పేదలకు సొంత ఇల్లు హోదా కల్పించడం కోసమే ఓటీఎస్..*


*- అమరేశ్వరుడికైనా బాబు కట్టిన అమరావతి ఎక్కడ ఉందో తెలుసా..!*


*- ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చట్టం చేస్తే.. ఇక చంద్రబాబు దొంగ ఓట్ల పప్పులుడకవ్..*


*- జగనన్న పాల వెల్లువతో పాడి రైతులకు మేలు*


*- మహిళల ఉసురు బాబుకే తగులుతుంది*


 *మీడియాతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)* 


తాడేపల్లి, డిసెంబర్ 20 (ప్రజా అమరావతి):

రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యానికి కూడా రేటు తగ్గించకుండా, ప్రతి గింజా కొనుగోలు చేయాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల  వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆర్బీకే కేంద్రాల్లో అవసరమైతే అదనంగా ఉద్యోగులను నియమించుకునైనా, మిల్లర్లతో ప్రమేయం లేకుండా, వాళ్ళకు కనీస మద్దతు ధర వచ్చే విధంగా చూడాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ఆదేశాలు ఇచ్చారు. అలానే, రంగుమారిన, వర్షాలకు దెబ్బతిన్న ధాన్యానికి కూడా రేటు తగ్గించకుండా, గిట్టుబాటు ధర కల్పించి,  ప్రతి గింజా కొనుగోలు చేయాలని చెప్పారు. 21 రోజుల్లోనే రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇప్పటికే 7 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభించాం. దాదాపు 6.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాం. ఈ సీజన్ లో  దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరుగుతుంది. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి, పొరుగున ఉన్న తెలంగాణలో కేంద్ర, రాష్ట్రాల మధ్య మాకు సంబంధం లేదు అంటే మాకు సంబంధం లేదని, దాళ్వాలో వరి వేయొద్దు, కొనుగోళ్ళ కేంద్రాలు పెట్టం, కొనలేము అని  బహిరంగంగానే మాట్లాడుకుంటున్న వాతావరణంం, పరిస్థితులు చూస్తున్నాం. 

- రాష్ట్రంలోనూ ఇబ్బందులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి గారు, ఏ పంట వేయాలి, ఏ పంట వేయొద్దు అన్నది మనం చెప్పే అంశమే గానీ, బలవంతంగా ఈ పంట వేయాలి, వేయొద్దు అని మనం చెప్పవద్దు అని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఉన్న పరిస్థితులు, వనరులు, వ్యవసాయ నిపుణల అభిప్రాయాల మేరకు.. ఏ పంట వేయాలో రైతులకు తెలుసు. ఏ పరిస్థితులు ఎదురైనా, రైతులు పండించిన ధాన్యం, ప్రతి గింజా రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తీరాల్సిందే, రైతుకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. చిన్నచిన్న లోటుపాట్లు ఉంటే, వాటిని సరిచేసుకుని, మంత్రులు, జిల్లా అధికారులంతా రైతుల దగ్గరకు వెళ్ళి, ధాన్యం కొనుగోళ్ళలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని క్షేత్రస్థాయిలోనే పరిశీలించి ఎక్కడికక్కడ పరిష్కరించమని చెప్పారు. సంక్రాంతి వరకు పెద్దఎత్తున ధాన్యం వస్తుంది కాబట్టి, అధికారయంత్రాంగం పూర్తి అప్రమత్తతతో పనిచేస్తుంది. *పేదలకు సొంత ఇల్లు హోదా కల్పించడం కోసమే ఓటీఎస్..*

- రేపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగారికి అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు తణుకులో పేదల ఇళ్ళకు సంబంధించి శాశ్వత హక్కులు కల్పించే విధంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, వన్ టైం సెటిల్ మెంటు(ఓటీఎస్)ను ముఖ్యమంత్రిగారు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. 

- కొన్నేళ్ళుగా ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళకు సంబంధించి, బ్యాంకు రుణాలు కట్టలేకపోవడం, దాంతో ఇంటి పట్టాలు హౌసింగ్ బోర్డు దగ్గరే ఉండటం, పొజీషన్ సర్టిఫికేట్ లేకపోవడం, దాంతో వచ్చిన కాడికి పేదలు లక్షకో, రెండు లక్షలకో తెగనమ్ముకోవడం, ప్రభుత్వ స్థలం అని రికార్డుల్లో ఉన్నప్పటికీ చేతులు మారిన కొంతమంది 5 నుంచి 10 లక్షలు పోసి మంచిగా ఇళ్ళు నిర్మించుకున్నా వాటిమీద ఎటువంటి హక్కులు లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. 

- ఇటువంటి పేదల ఇళ్ళు దాదాపు 50 లక్షలకు పైగా ఉన్నాయి. హౌసింగ్ బోర్డు ఇచ్చిన రుణాలతో రూ.70 వేలో, రూ.1 లక్షతోనో  నిర్మించిన ఇళ్ళు అవి కాదు. గతంలో ఎన్టీఆర్ ఇచ్చినటువంటి రూ. 35 వేలతో నిర్మించినవి కూడా కాదు. ప్రతి పేదవాడు, పైసా పైసా కూడబెట్టుకుని, ప్రభుత్వం ఇచ్చిన దానితోపాటు, ఆ ఇళ్ళపై రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చు చేసుకుని నిర్మించుకున్నారు. అంత ఖర్చు పెట్టి నిర్మించుకున్నా, ఆ ఇంటిపై హక్కు లేక, దస్తావేజులు బ్యాంకుల్లో ఉండి, పది  లక్షలు విలువ చేసే ఇంటిని రూ. 2-3 లక్షలకు అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డిగారు ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన 3648 కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో దాదాపు 2 కోట్లమంది ప్రజలను కలిస్తే.. ఆ పాదయాత్రలో ఎంతో మంది పేదలు ఈ విషయాన్ని జగన్ గారి దృష్టికి తెచ్చారు. ఆరోజు పేదలకు శాశ్వత గృహ హక్కు కల్పిస్తానని ఇచ్చిన మాట మేరకే.. ఈరోజు ఓటీఎస్ స్కీం తెచ్చారు.  బ్యాంకుల్లో ఆ ఇంటిపై అప్పు లక్ష ఉన్నా, రెండు లక్షలు ఉన్నా, మూడు లక్షలు ఉన్నా.. అప్పు ఎంత ఉన్నా.. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నామ మాత్రం ఫీజులు అంటే.. రూ. 10 వేలు, 15 వేలు, 20 వేలు కడితే.. ప్రభుత్వమే వన్ టైం సెటిల్ మెంటు కింద, వాస్తవానికి 7-8 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు అంటే,  రెండు లక్షలు అవుతున్నా, ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసి పేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తుంది.  *పేదలు జగన్ గారికి అండగా ఉన్నారనే బాబు అండ్ కో కడుపు మంట*

- ఇది బలవంతం కాదు. సొంత ఇల్లు అనిపించుకోవాలనే కోర్కె ఉండే పేదలకోసం.. ముఖ్యమంత్రి గారు స్కీము పెడితే, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు, చంద్రబాబునాయుడుతో కలిసిపోయి.. రోజూ పది మంది పనికిమాలినవాళ్ళను టీవీ ఛానళ్ళలో కూర్చోబెట్టి.. జగన్ గారు పేదల రక్తం పీల్చేస్తున్నారంటూ విషం కక్కే కార్యక్రమాలు చేస్తున్నారు.  చంద్రబాబుకు వంత పాడే చెత్త పేపర్లు, డబ్బా మీడియా రోజూ విషం కక్కుతున్నా జగన్ మోహన్ రెడ్డిగారి మీద ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఒక్క శాతం కూడా తగ్గించలేరు. 

- వన్ టైం సెటిల్ మెంటు స్కీం వల్ల దాదాపు 50 లక్షల మంది పేదలు సొంత ఇంటికి యజమానులు అవుతారు. దీంతో ఆ కుటుంబాల వారంతా జగన్ మోహన్ రెడ్డిగారికి అండగా ఉంటారు అనే కడుపు మంటతోనే చంద్రబాబు, ఆయనకు వంత పాడే మీడియా దీనిపై బురదజల్లాలని చూస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉంటే, ఆయన్ను అడ్డం పెట్టుకుని బతకడానికి అలవాటు పడ్డ వారి అనుకూల మీడియా నిత్యం దుష్ప్రచారం చేస్తుంది. ఈ స్కీము వల్ల జగన్ గారికి ఏమైనా నష్టం జరిగేటట్టు అయితే.. ఈ చెత్త మీడియా తడిగుడ్డ వేసుకుని నిద్రపోయేవారు. ఇంకా ప్రోత్సహించేవారు. వీళ్ళకు ఇబ్బంది కలిగే పరిస్థితి కాబట్టి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు.  పొద్దున్నుంచీ.. రాత్రి వరకు జగన్ గారు చేసే ప్రతి కార్యక్రమం మీద విషం కక్కడమే పనిగా పెట్టుకున్న వారికి, కనీసం డిబేట్లలో డ్రసులు కూడా మార్చడం లేదు. ఆ టీవీలో కొంతసేపు కనిపిస్తారు.. మళ్ళీ వారే మరో టీవీలో ఆ నలుగురే కనిపిస్తారు. జనం ఏమనుకుంటారో అన్న సిగ్గు కూడా వీళ్ళకు లేదు. 

- ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది ఓటీఎస్ స్కీములో కట్టి ఇళ్ళు సొంతం చేసుకోవటానికి ముందుకొచ్చారు. తణుకులో జగన్ గారి చేతుల మీదుగా రేపు లాంఛనంగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం..  రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అవుతుంది. 

- చంద్రబాబు, ఆయనకు వత్తాసు  పలికే దుర్మార్గులు, దుష్టుల మాటలు నమ్మకుండా, జగన్ గారు పేదల మేలు కోసం చేస్తోన్న ఓటీఎస్ స్కీమును వినియోగించుకోవాలని కోరుతున్నాను. చంద్రబాబు జన్మలో ఇటువంటి మంచి పని చేయరు. *జగనన్న పాల వెల్లువతో పాడి రైతులకు మేలు*

- గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించిన కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ అమూల్ సౌజన్యంతో.. రాష్ట్రంలో "జగనన్న పాల వెల్లువ" కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో 5 రోజులు క్రితం 5-6 మండలాల్లో లాంఛనంగా ప్రారంభిస్తే.. స్థానికంగా ఉన్న విజయ డైరీ పోటీకి వచ్చి, పాడి రైతులకు లీటరుకు రూ. 6.50 పెంచి డబ్బులు చెల్లిస్తున్నారు. అంటే, జగన్ గారు తీసుకొచ్చిన జగనన్న పాల వెల్లువ కార్యక్రమం వల్ల, పాడి రైతులకు ప్రతి లీటరుకు రూ. 6 నుంచి 7 ఆదాయం పెరిగింది. అంటే, ఒక గేదె ఉన్న పాడి రైతుకు, రోజూ ఐదారు లీటర్లు అమ్ముకునే రైతుకు కూడా నెలకు రూ. 1200-1300, ఏడాదికి రూ. 15 - 20 వేలు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జగన్ మోహన్ రెడ్డిగారు పాడి రైతులకు మేలు చేసే ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం వల్లే ఈరోజు మేలు జరుగుతుంది. *హెరిటేజ్ లూటీ..*

- అమూల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే... హెరిటేజ్ కోసమో, మరొకరికోసమో దీనిని తీసుకువచ్చారని ఇదే చంద్రబాబు, ఆయనకు డబ్బా కొట్టే ఓ వర్గం మీడియా అంతా ఏడిచారు. ఆ వర్గం మీడియాలో కూడా నిత్యం అవే రాతలు రాసి రాక్షసానందం పొందారు. ఈరోజుకైనా నిజం తెలుసుకుంటే మంచిది. జగన్ గారు తీసుకొచ్చిన ఈ  కార్యక్రమం వల్ల ప్రతి పాడి రైతుకు, పాడిని నమ్ముకుని బతికే ప్రతి పేద మహిళ కూడా లబ్ధి చేకూరుతుందన్నది చంద్రబాబు, ఆయనకా బాకా ఊదే మీడియా తెలుసుకోవాలి. ఇంతకాలం చంద్రబాబు ఇంటి సంస్థ హెరిటేజ్ పేరుతో ఒక్క గేదె ఉన్న పేద పాడి రైతు నుంచి ఏడాదికి 15 వేల రూపాయలకు పైగా లూటీ చేశారు. అంటే, పాడి రైతుల సొమ్మును ఏ విధంగా తిన్నారో ప్రజలు గమనించాలి. ఇంతకాలం డైరీల పేరుతో జిల్లాలు పంచుకుని మరీ పాడి రైతుల్ని, మహిళల్ని లూటీ చేసిన వారికి  గట్టి దెబ్బతగులుతుంది. 

- జగనన్న పాల వెల్లువ వచ్చింది కాబట్టి రేటు వచ్చింది, ఈ కార్యక్రమానికే మీరు ఇస్తే.. లాభాలు వచ్చిన వాటిని డివిడెండ్ల రూపంలో రైతులకే ఖర్చు పెడుతుంది. రాష్ట్రంలో ఉన్ మహిళలు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. *ఇక చంద్రబాబు దొంగ ఓట్ల పప్పులుడకవ్..*

- చంద్రబాబు అంటేనే మేనేజ్ చేయటం.. మ్యానిపులేట్ చేయడం అని అందరికీ తెలుసు. ఆ విద్యలతోనే ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 10 వేలు దొంగ ఓట్లు చేర్చుకుని అడ్డగోలుగా గెలవాలని చూస్తున్నాడు.  చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా 6 నుంచి 10 వేలు, చుట్టు పక్కల నియోజకవర్గాలకు చెందిన వారి ఓట్లతో సహా దొంగ ఓట్లను చేర్పించాడు. ఓటరు కార్డుతో ఆధార్ ను అనుసంధానం చేస్తూ.. పార్లమెంటులో ఎన్నికల చట్టాల సవరణ బిల్లును ఆమోదించడంతో చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక సామెతలో తయారవుతుంది. ఈ నిర్ణయం వల్ల  కుప్పంలో కూడా 10 వేల దొంగ ఓట్లు పోయే పరిస్థితి ఉంటుంది. పార్లమెంటు ఈ చట్టం చేస్తే.. రాష్ట్రానికి చంద్రబాబు పీడ శాశ్వతంగా విరగడ అవుతుంది.*చంద్రబాబు ఫేస్ చూసి అప్పులు ఇస్తారా..?*

- చంద్రబాబు అధికారంలో ఉంటే.. చంద్రబాబు ఫేస్ చూసి బ్యాంకుల వాళ్ళంతా అప్పులు ఇచ్చేస్తాం రండి అంటారని ఆ వర్గం మీడియా భజన చేస్తుంది. అదే మీడియా జగన్ గారు అధికారంలోకి రాగానే, ఆయన ఫేస్ చూసి అందరూ వెళ్ళిపోతున్నారు అని మొదటి ఆరు నెలలు రాశారు. మళ్ళీ అదే మీడియా, ఆ తర్వాత జగన్ గారు చేసినంత అప్పు ఎవరూ చేయడం లేదు అని చెత్త డిబేట్లు పెడుతున్నారు. ఎవరైనా అప్పులు ఎందుకిస్తారు, చంద్రబాబు ఫేస్ చూసి ఇవ్వరు. ఈ రాష్ట్రంలో వనరులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి, ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకుని, మళ్ళీ ఎలా తీరుస్తారో చూసే బ్యాంకులు అప్పులు ఇస్తాయి.

ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న నాడు-నేడు కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చెందుతున్న విద్య, వైద్య రంగాలు, మెడికల్ కాలేజీల నిర్మాణం, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు.. వీటన్నింటినీ చూసి ఎవరైనా అప్పులు ఇస్తారు. 

- రామోజీరావు, రాధాకృష్ణలు రాష్ట్రం గురించి బాగా రాయలేదనిగానీ, వాళ్ళు బాగా రాశారనిగానీ అప్పు ఇచ్చే పరిస్థితి ఉండదు. దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో నిండు నూరేళ్ళు ఆయన జీవించి, మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు జగన్ గారు చేస్తారు. *మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..*


*మహిళల ఉసురు బాబుకే తగులుతుంది*

- మహిళల గురించి మాట్లాడుతున్న భువనేశ్వరి గారు ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి.  ఆరోజు ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలో ఏడిపించారు. లక్ష్మీ పార్వతిని రోడ్డు మీద జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి బజారు పాలు చేశారు. వారందర్నీ ఏడిపించిన దుర్యోధనుడు చంద్రబాబే.  వాళ్ళ ఉసురు తగిలే కదా ఈరోజు రాజకీయంగా దిక్కుమాలిన పరిస్థితిల్లోకి చంద్రబాబు వెళ్ళారు. మహిళల ఉసురు తగిలి పూర్తిగా నాశనం అయ్యి, వచ్చే ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతాడు. 

- మహిళల ఉసురు తగిలేకదా.. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా పనిచేసిన వ్యక్తి ఈరోజు అధికారం కోల్పోయి, అర్థరాజ్యానికి ప్రతిపక్ష నాయకుడు అయి, రాబోయే రోజుల్లో ప్రతిపక్ష నాయకుని హోదా కూడా పోయి, మరింత సర్వనాశనం అవుతాడు. భువనేశ్వరి చెప్పినట్టుగా జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. భార్యను అడ్డుపెట్టి ఎవరన్నా రాజకీయాలు చేస్తారా. అటువంటి వ్యక్తి సర్వనాశనం అవుతాడు. 


- ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా.. అన్నట్టుగా తండ్రి చంద్రబాబు ఒక వెన్నుపోటుదారుడు, అవినీతిపరుడు, ప్రతిదీ మోసం, వంచన, దగా చేసే అతని కొడుకు లోకేష్ కు కూడా అవే గుణాలు అబ్బాయి.  గాడిద ను తీసుకొచ్చి గుఱ్ఱంలా పెంచితే గాడిద గుఱ్ఱం కాలేదు కదా..


*అమరేశ్వరుడికైనా బాబు కట్టిన అమరావతి ఎక్కడ ఉందో తెలుసా..!*

- చంద్రబాబు పగటి వేషగాడిలా తన డప్పు తాను కొట్టుకోవడం బాగా అలవాటు. హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టు తాను కట్టానంటాడు. చంద్రబాబుకు ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడైనా చర్చకు నేను వస్తా. చర్చకు సిద్ధమా..? 

- శంషాబాద్ ఎయిర్ పోర్టు కు శంఖుస్థాపన చేసింది, ప్రారంభోత్సవం చేసిందీ రాజశేఖరరెడ్డి గారే..

- అవుట్ రింగు రోడ్డుకు శంఖుస్థాపన చేసిందీ, ప్రారంభోత్సవం చేసిందీ రాజశేఖరరెడ్డిగారు

- పోలవరం రూపకర్త నేనే, పోలవరం నేనే కట్టానంటాడు.. చంద్రబాబు పోలవరం కట్టాడా..? 

- అమరావతి సృష్టికర్తను నేనే అంటాడు. అక్కడ ఏమైనా ఉందా.. గ్రాఫిక్స్ సృష్టించాడు. చంద్రబాబు భ్రమరావతిలో ఒరిజనల్ అమరావతి ఉందా.. అసలు అమరావతి ఎక్కడ ఉంది. అమరేశ్వరుడికైనా బాబు కట్టిన అమరావతి ఎక్కడ ఉందో తెలుసా.. ? 

- చంద్రబాబు చెప్పేవాటిలో ఒక్కటి నిజం ఉన్నా నేను రాజకీయాలు వదిలేసి వెళతా. చంద్రబాబు సిద్ధమా..? 


*సలహాలు ఇవ్వడం మాని పవన్ కల్యాణ్ చేయాల్సింది చేయాలి*

- పవన్ కల్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపాల్సింది కేంద్రం. మేం ఏం చేయాలో మేము చేస్తాం. ఆయనది అసలు ఏ పార్టీనో కూడా తెలియడం లేదు. జగన్ మోహన్ రెడ్డిగారికి ఉచిత సలహాలు ఇవ్వడానికి ఆయనను మేమైనా సలహాదారుడిగా పెట్టుకున్నామా...? మాకు సలహాలు ఇవ్వటం మాని, ఆయన చేయాల్సింది చేయాలి. 


- బీజేపీతో సంబంధాలు దెబ్బతినకుండా, మోడీ, అమిత్ షా , రాష్ట్ర బీజేపీ నాయకులు ఏమీ అనుకోకుండా.. నీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా పోరాటం చేసుకో పవన్ కల్యాణ్. 


- సలహాలు ఇవ్వాలనుకుంటే.. తన దత్త తండ్రి బాబుకు పవన్ కల్యాణ్ సలహాలు ఇచ్చుకోమనండి. మాకు పనికి మాలిన సలహాలు వద్దని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Popular posts
కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టిసి ద్వారా ఇసుక టెండర్ల ప్రక్రియ జరిగింది.
Image
Gudivada - Kankipadu road widening, development works start
Image
మెడల్ హౌస్.... - రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు - 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం - కరీంనగర్‌లో యువబిల్డర్ ప్రయోగం సక్సెస్ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు. ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది. నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్ది గా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది. ఖర్చు పెట్టారిలా: గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. చైనా, జర్మనీల్లో చూసి ప్లాన్‌చేశారు పేరాల కృష్ణారావు, ఎండీ, వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించారు. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. పేద ప్రజల కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి మోడల్ హౌస్ అని పేరుపెట్టారు
Image
నైపుణ్యాల‌కు ప‌దును పెట్టండి... విజేత‌లుగా నిల‌వండి
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image