ఫీవర్ సర్వే పటిష్టంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి

 నెల్లూరు (ప్రజా అమరావతి);ఒమైక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సమీర్ శర్మ,  జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. 


గురువారం సాయంత్రం వెలగపూడిలోని సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సమీర్ శర్మ, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై, కోవిడ్ మూడో దశ వ్యాప్తి నియంత్రణ కు మరియు ఒమైక్రాన్ వేరియంట్ పట్ల తీసుకోవలసిన ముందస్తు చర్యల పై  సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ఒమైక్రాన్ వేరియంట్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో   ప్రజలు అప్రమత్తంగా  ఉండేలా  చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఫీవర్ సర్వే  పటిష్టంగా  జరిగేలా చర్యలు తీసుకోవాల


ని ఆయన సూచించారు. కోవిడ్ మూడో వేవ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో  వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టడంతో పాటు కోవిడ్ మూడో దశ నియంత్రణ కు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి. ఎన్. చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) శ్రీ గణేష్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రాజ్యలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.