కొవ్వూరు మండల స్థాయి ఆటల పోటీలు

 


కొవ్వూరు (ప్రజా అమరావతి)!ఏపీ సీఎం కప్. 2021 


 కొవ్వూరు మండల స్థాయి ఆటల పోటీలు  కొవ్వూరు మండలములోని అన్ని గ్రామములకు సంబంధించి   ఏపీ సీఎం కప్ 2021 కొవ్వూరు లోని    ఎన్టీఆర్ స్టేడియం లో డిసెంబర్ 3 వతేది  శుక్రవారం ఉదయం 10. 00 గంటల నుండి నిర్వహించడం జరుగుతోందని డివిజనల్ డెవలప్మెంట్ అధికారి, కొవ్వూరు ఎంపీడీఓ పి. జగదాంబ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. 

ఈ పోటీల్లో భాగంగా  కబడ్డీ, ఖో -ఖో, వాలీబాల్, షెటిల్, బాల్ బ్యాటమేంటన్  మొదలగు క్రీడల్లో  పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆటల పోటీల్లో  పాల్గొనుటకు ఆశక్తి గల క్రీడా కారులు వారి వివరాలతో  నాగరాజు గారు (PD ) : 9398468310 ని సంప్రదించవలసినదిగా కోరియున్నారు. గ్రామ కార్యదర్సులు వారి గ్రామ పరిధిలో పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి గలవారి విద్యార్థిని, విద్యార్థుల వివరాలు సేకరించి పోటీలకు పంపవలసినదిగా ఆదేశించారు.